ఉపాధికేదీ హామీ?

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి(నరేగా) బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు కేంద్రం పరిమితమైతే రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం చూపనుంది.

Published : 02 Feb 2023 03:55 IST

బడ్జెట్‌లో కేటాయింపులకు పరిమితమైతే రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం

ఈనాడు, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి(నరేగా) బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు కేంద్రం పరిమితమైతే రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. లేబర్‌ బడ్జెట్‌, మెటీరియల్‌ నిధుల్లో కలిపి రూ.1,000 కోట్ల వరకు తగ్గొచ్చని అంచనా. నరేగాలో ఏటా దాదాపు రూ.5 వేల కోట్లతో గ్రామాల్లో వివిధ రకాలైన పనులతో పాటు లక్షలాది మంది కూలీలకు ఉపాధి దొరుకుతోంది. గ్రామాల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్న నరేగాకు కేంద్ర బడ్జెట్‌లో ఏటికేడు కేటాయింపులు తగ్గుతున్నాయి. దీంతో రాష్ట్రంలో 2020-21లో పని దినాలు 25 కోట్ల నుంచి 2022-23 నాటికి 19 కోట్లకు తగ్గింది. పని దినాల కేటాయింపులు తగ్గితే రాష్ట్రానికి మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రావాల్సిన నిధుల్లోనూ భారీగా కోతపడనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉపయోగించుకున్న 19 కోట్ల పని దినాలపై కూలీలకు వేతనాల కింద(ఒక్కొక్కరికి కనీస వేతనం రూ.257 చొప్పున) రూ.4,883 కోట్లు కేంద్రం కేటాయిస్తే... ఇందులో 2/3 వంతు అంటే.. రూ.3,255 కోట్లు మెటీరియల్‌ కింద రాష్ట్రానికి సమకూరనుంది. వీటితో నిర్లక్ష్యానికి గురవుతున్న గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు వివిధ పనులు చేపట్టొచ్చు. రాష్ట్రంలో ఒక ఏడాదిలో రూ.4-5 వేల కోట్ల మెటీరియల్‌ నిధులతో పనులు చేయించిన సందర్భాలున్నాయి. పని దినాలు తగ్గిస్తూ పోతే...రూ.3 వేల కోట్లు కూడా మెటీరియల్‌ కింద రాకపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని