పైన హుషారు.. లోపల ఉసూరు

రంగులు వేసి బయట జిగేలుమనిపించారు. లోపల అరకొర వసతులతో ఉసూరుమనిపిస్తున్నారు. ఇదీ టిడ్కో ఇళ్ల పరిస్థితి. నంద్యాలలో 3 చోట్ల 10,000 టిడ్కో గృహాలను నిర్మిస్తున్నారు.

Published : 07 Feb 2023 02:24 IST

న్యూస్‌టుడే, నంద్యాల గాంధీచౌక్‌: రంగులు వేసి బయట జిగేలుమనిపించారు. లోపల అరకొర వసతులతో ఉసూరుమనిపిస్తున్నారు. ఇదీ టిడ్కో ఇళ్ల పరిస్థితి. నంద్యాలలో 3 చోట్ల 10,000 టిడ్కో గృహాలను నిర్మిస్తున్నారు. అందులో 4100 వరకు పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తికాగా, వైకాపా అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లయినా మిగిలిన పనులను పూర్తి చేయలేదు. నెల క్రితం మంత్రి, ప్రజాప్రతినిధుల సమక్షంలో హడావుడిగా కొన్ని ఇళ్లకు గృహప్రవేశం చేశారు. ఇంకా చాలా ఇళ్లకు నీటి సౌకర్యం లేదు. రహదారులు పూర్తి కాలేదు. పార్కుల ఏర్పాటు ఊసే లేదు. డ్రైనేజీలు పూర్తిస్థాయిలో లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని