విద్యాశాఖకు ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యం

విద్యాశాఖకు ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యం ఇస్తోందని శాసన సభలో అధికార పక్ష ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అదివారం పాఠశాల, ఉన్నత విద్యాశాఖ పద్దులపై శాసన సభలో జరిగిన చర్చ సందర్బంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ జగన్‌ నిర్ణయాల వల్ల ప్రతి పేదవాడికీ విద్య అందే అవకాశం ఏర్పడిందన్నారు.

Published : 20 Mar 2023 04:38 IST

శాసన సభలో వైకాపా ఎమ్మెల్యేలు

ఈనాడు, అమరావతి: విద్యాశాఖకు ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యం ఇస్తోందని శాసన సభలో అధికార పక్ష ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అదివారం పాఠశాల, ఉన్నత విద్యాశాఖ పద్దులపై శాసన సభలో జరిగిన చర్చ సందర్బంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ జగన్‌ నిర్ణయాల వల్ల ప్రతి పేదవాడికీ విద్య అందే అవకాశం ఏర్పడిందన్నారు. విద్యాదీవెన ద్వారా రూ.9,947 కోట్లు, వసతి దీవెన ద్వారా రూ.3,365 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. రాజానగరంలో ఏర్పాటైన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు ఇవ్వాలన్నారు. సీతానగరం డిగ్రీ కళాశాలలో సరైన సిబ్బంది లేరని, కొత్త పోస్టులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే వరప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల బడుగు, బలహీన వర్గాలకు జగన్‌ మేలు చేసిన వారయ్యారన్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నైపుణ్య శిక్షణతో ఏటా 50 వేల మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. అరకు లోయలో 5 ఎకరాలను నైపుణ్యాభివృద్ధి కళాశాలకు తీసుకున్నామని చెప్పారు. బద్వేలు ఎమ్మెల్యే సుధ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో మొబైల్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. వైద్య ఆరోగ్యశాఖమంత్రి విడదల రజిని మాట్లాడుతూ స్క్రీనింగ్‌ యూనిట్‌ ఏర్పాటు అంశం పరిశీలిస్తామన్నారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం భూముల సర్వేను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు