మూడో విడత ఆసరా నేడు

డ్వాక్రా సంఘాల్లోని 78.94 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో మూడో విడత కింద రూ.6,419 కోట్ల ఆసరా సాయాన్ని శనివారం నుంచి జమ చేయనున్నారు.

Published : 25 Mar 2023 03:26 IST

10 రోజుల పాటు డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: డ్వాక్రా సంఘాల్లోని 78.94 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో మూడో విడత కింద రూ.6,419 కోట్ల ఆసరా సాయాన్ని శనివారం నుంచి జమ చేయనున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించనున్న సభలో ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏప్రిల్‌ 5 వరకు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. తాజాగా విడుదల చేయనున్న రూ.6,419.89 కోట్లతో కలిపి ఇప్పటివరకు ఆసరా కింద రూ.19,178 కోట్లు అందించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు