‘కోనసీమ’ కేసులు ఎత్తేస్తే బుద్ధి చెబుతాం

కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో జరిగిన అల్లర్ల ఘటనలో నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న సీఎం జగన్‌కు తగిన బుద్ధి చెబుతామని జిల్లా దళిత ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు.

Published : 30 Mar 2023 04:42 IST

దళిత ఐక్యవేదిక నాయకుల హెచ్చరిక

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో జరిగిన అల్లర్ల ఘటనలో నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న సీఎం జగన్‌కు తగిన బుద్ధి చెబుతామని జిల్లా దళిత ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. అల్లర్ల కేసుల ఎత్తివేతపై అమలాపురం గడియారస్తంభం కూడలి వద్ద జిల్లా దళిత ఐక్యవేదిక నాయకులు బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేసులు ఎత్తేస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వైకాపా కాపు, శెట్టిబలిజ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, తోట త్రిమూర్తులు వంతపాడటం విడ్డూరమన్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ రాజకీయం కోసం మరిచినా తాము మర్చిపోమని చెప్పారు. కార్యక్రమంలో సంఘ ఛైర్మన్‌ డీబీ లోక్‌, కన్వీనర్‌ జంగా బాబురావు, మెండు సురేష్‌, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని