వైకాపా నేతల పంతం.. ఆగిన సీతారాముల కల్యాణం

ఏటా ఆ గ్రామంలో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేవారు. ఈ సంవత్సరం మాత్రం వైకాపా నాయకుల బెదిరింపులతో రద్దయింది.

Updated : 31 Mar 2023 06:01 IST

గడివేముల, న్యూస్‌టుడే: ఏటా ఆ గ్రామంలో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేవారు. ఈ సంవత్సరం మాత్రం వైకాపా నాయకుల బెదిరింపులతో రద్దయింది. గ్రామంలో ఘర్షణలు జరుగుతాయన్న కారణంతో కల్యాణోత్సవాన్ని రద్దు చేసినట్లు ఆలయ ఈవో పోలీసులకు తెలపడం గమనార్హం. నంద్యాల జిల్లా గడివేముల మండలం కె.బొల్లవరం గ్రామంలోని ఆంజనేయ, వీరభద్రస్వామి ఆలయానికి 20 ఎకరాల భూమి ఉంది. ఏటా రూ.2 లక్షల కౌలు వస్తుంది. దీంతో శ్రీరామనవమి రోజు కల్యాణాన్ని ఘనంగా నిర్వహించే వారు. ప్రస్తుతం ఆలయంలో అర్చకుడిగా రాజన్న కొనసాగుతున్నారు. ఆయనను తొలగించి మరొకరిని నియమించాలని అధికార పార్టీ నేతలు కోరుతున్నారు. వారు చెప్పినట్లు అర్చకుడిని మార్చలేదన్న పంతంతో కల్యాణోత్సవానికి సహకరించబోమని అధికారీ పార్టీ పెద్దలు చెప్పారని ఈవో గరువారం పోలీసులకు తెలిపారు. గ్రామంలో గొడవలు జరిగే ఆస్కారమున్నందున ఉత్సవాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కల్యాణాన్ని రద్దు చేయించడం దారుణమని రామభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘పశ్చిమ’లో అపశ్రుతి

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని వేణుగోపాలస్వామి, సీతారామస్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఆలయం పైకప్పులో మంటలు చెలరేగి తాటాకుపందిరి ఆహుతైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు