శ్రీరామ శోభాయాత్రతో సమాజం ఏకం

రాష్ట్రంలో హిందూ చైతన్యభావన వ్యక్తమవుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేయడంలో శ్రీరామ శోభాయాత్ర దోహదం చేస్తుందని చెప్పారు.

Published : 31 Mar 2023 04:46 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో హిందూ చైతన్యభావన వ్యక్తమవుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేయడంలో శ్రీరామ శోభాయాత్ర దోహదం చేస్తుందని చెప్పారు. గుంటూరు శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో శోభాయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతీయ సంస్కృతిలో హిందూ సంప్రదాయానికి ప్రత్యేక స్థానం ఉందని, గత కొన్నేళ్లుగా దాన్ని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామినీ శర్మ మాట్లాడుతూ దేశంలో హిందువుల తిరుగుబాటు మొదలైందని, ప్రతి హిందువు ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం శోభాయాత్రలో నృత్యం చేశారు. శోభాయాత్రలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.దుర్గాప్రసాద్‌, కేంద్ర కార్మిక శాఖ బోర్డు ఛైర్మన్‌ వల్లూరి జయప్రకాష్‌ నారాయణ్‌, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్ర సందర్భంగా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు