Amaravati: జగన్‌ సభకు వెళ్లం.. భీష్మించిన సెంటు భూమి లబ్ధిదారులు

రాజధానిలో శుక్రవారం (26న) జరిగే సీఎం సభకు తాము వెళ్లబోమని సెంటు భూమి లబ్ధిదారులు తేల్చి చెప్పారు. మంగళగిరి గండాలయపేటలో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇస్తామని, సీఎం సభకు రావాలంటూ సచివాలయ ఉద్యోగులు చెప్పినా.. వారు నిరాకరించారు.

Updated : 26 May 2023 07:13 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: రాజధానిలో శుక్రవారం (26న) జరిగే సీఎం సభకు తాము వెళ్లబోమని సెంటు భూమి లబ్ధిదారులు తేల్చి చెప్పారు. మంగళగిరి గండాలయపేటలో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇస్తామని, సీఎం సభకు రావాలంటూ సచివాలయ ఉద్యోగులు చెప్పినా.. వారు నిరాకరించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొండలపై ఎంతో మంది నివసిస్తున్నారని, వారికి లేని ఇబ్బంది మంగళగిరి కొండపై జీవించే వారికి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం రాత్రి సీపీఎం ఆధ్వర్యంలో కొండ ప్రాంతంలోని ఎస్టీవాసులు సమావేశమయ్యారు. రాజధాని ప్రాంతంలో స్థలాలిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు నమ్మలేమన్నారు. ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు కొత్తగా కట్టుకొనే స్తోమత లేదని తెలిపారు. తాము నివసిస్తున్న ప్రాంతాల్లోనే పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఈ నెల 27వ తేదీన తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని