నవంబరులో మహా కుంభాభిషేకం

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహా కుంభాభిషేకం కార్యక్రమాన్ని నవంబరులో నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం వెల్లడించారు.

Published : 04 Jun 2023 05:16 IST

దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహా కుంభాభిషేకం కార్యక్రమాన్ని నవంబరులో నిర్వహిస్తామని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం వెల్లడించారు. ఈ విషయమై ఇప్పటికే తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దేవాదాయశాఖ కమిషనర్‌, అధికారులు, తాను సమావేశమై చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున కార్తికమాసంలో కుంభాభిషేకం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. హైకోర్టు సూచన ప్రకారం ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, షణ్ముఖశర్మలను సంప్రదించి తేదీలను ఖరారు చేస్తామన్నారు. సెప్టెంబరు నుంచి పనులు మొదలుపెట్టాలని ఈవో ఎస్‌.లవన్నను ఆదేశించారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు: ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. కాపు కార్పొరేషన్‌కు ఇస్తామన్న నిధులకంటే అదనంగా ఇస్తున్నామని, కాపునేస్తం ద్వారా లక్షల మంది మహిళలు, కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. జగన్‌ పరిపాలనపై హరిరామ జోగయ్య ఏమని లేఖ రాస్తారని మంత్రి ప్రశ్నించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని