ఆరోగ్యశ్రీ సేవలకు ఏటా రూ.3 వేల కోట్లు

ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలకు ఏటా రూ.3 వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.

Updated : 05 Jun 2023 05:59 IST

వైద్యారోగ్య శాఖ మంత్రి రజిని

ఈనాడు, అమరావతి: ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలకు ఏటా రూ.3 వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు అందిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలతో మంత్రి ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఎస్‌.పి.సింగ్‌ బఘేల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ.. ‘గతంలో ఆరోగ్యశ్రీ కింద 1,055 ప్రొసీజర్లకు మాత్రమే ఉచిత వైద్యం అందేది. వాటి సంఖ్యను ప్రస్తుతం 3,257కు పెంచాం. రాష్ట్రంలో 90 శాతం మంది ప్రజలకు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ కింద 2,275 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ద్వారా ఉచిత వైద్యం అందుతోంది. రోగులు కోలుకునే వరకు ఆసరా పథకం కింద రోజుకు రూ.225 అందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులను అందుబాటులో ఉంచాం. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో ఇప్పటి వరకు 1.11 కోట్ల మందికి వైద్య సేవలు ఉచితంగా అందించాం’ అని వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు