భోళాశంకర్‌ చిత్రానికి సంబంధించి డాక్యుమెంట్లు సమర్పించలేదు: ఏపీ ప్రభుత్వం

చిరంజీవి నటించిన భోళాశంకర్‌ సినిమా టికెట్‌ ధరల పెంపునకు సంబంధించి వివిధ పత్రాలు, డాక్యుమెంట్లు అందజేయాలంటూ నిర్మాణ సంస్థ అడ్వెంచర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కోరామని, అయితే ఇప్పటివరకు వాటిని సమర్పించలేదని ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

Updated : 11 Aug 2023 09:20 IST

ఈనాడు, అమరావతి: చిరంజీవి నటించిన భోళాశంకర్‌ సినిమా టికెట్‌ ధరల పెంపునకు సంబంధించి వివిధ పత్రాలు, డాక్యుమెంట్లు అందజేయాలంటూ నిర్మాణ సంస్థ అడ్వెంచర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కోరామని, అయితే ఇప్పటివరకు వాటిని సమర్పించలేదని ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. చిత్ర నిర్మాణ సంస్థ జులై 30న ఏపీ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ)కు అర్జీ పంపిందని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌ పారితోషికాలు కాకుండా సినిమా నిర్మాణ ఖర్చు, ప్రొడక్షన్‌, పోస్ట్‌ప్రొడక్షన్‌ కలిపి రూ.100 కోట్లు దాటడానికి సంబంధించి అఫిడవిట్‌, జీఎస్టీ చెల్లింపులు, సెన్సార్‌ పూర్తయ్యాక సినిమా నిడివిలో 20 శాతం ఏపీలో చిత్రీకరణకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు తదితరాలు అందజేయాలని ఆగస్టు 2న లేఖద్వారా తెలియజేసినా, ఇంతవరకూ వాటిని సమర్పించలేదని తెలిపింది. గతంలో ఆచార్య, వాల్తేరు వీరయ్య చిత్రాల నిర్మాణ సంస్థలు, నిర్మాతలు ఆయా పత్రాలన్నీ ఇవ్వడంతో, ప్రత్యేక టికెట్ల రేట్లు పొందారని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు