Praveen Prakash: నేను ఐఏఎస్‌ను.. నాకలాంటి భయం లేదు..!

‘ఆర్జేడీ, ఎంఈవోల మీదైతే డౌన్‌ డౌన్‌ అంటూ మీరు ఆందోళనలు చేస్తారు. నాకలాంటి భయం లేదు. నేను ఐఏఎస్‌ను. మిమ్మల్ని మార్చలేకపోతే నేను ఇంకో శాఖలోకి వెళతా.. మీ పరిస్థితేంటి? నేనేంటో చూపించమంటారా?’ అంటూ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్‌ ఉపాధ్యాయులపై మండిపడ్డారు.

Updated : 20 Aug 2023 08:50 IST

టీచర్లపై ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్‌ ఆగ్రహం

కదిరి, న్యూస్‌టుడే: ‘ఆర్జేడీ, ఎంఈవోల మీదైతే డౌన్‌ డౌన్‌ అంటూ మీరు ఆందోళనలు చేస్తారు. నాకలాంటి భయం లేదు. నేను ఐఏఎస్‌ను. మిమ్మల్ని మార్చలేకపోతే నేను ఇంకో శాఖలోకి వెళతా.. మీ పరిస్థితేంటి? నేనేంటో చూపించమంటారా?’ అంటూ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్‌ ఉపాధ్యాయులపై మండిపడ్డారు. శనివారం ఆయన శ్రీసత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో పర్యటించారు. కదిరిలోని మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, ఎన్పీకుంటలోని పాఠశాలలను తనిఖీ చేశారు. కుటాగుళ్ల మున్సిపల్‌ ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా మన విద్యార్థులు సత్తా చాటాలని పెద్దలు చర్చించి ట్యాబ్‌లతో బైజూస్‌ బోధనను అమలు చేస్తున్నారు. తరగతిలో చూస్తే కొందరి వద్దే ట్యాబ్‌లు ఉన్నాయి. విద్యార్థులతో చేయించిన ఎక్సర్‌సైజ్‌ టెస్టులు చూస్తుంటే అన్నీ సున్నాలే ఉన్నాయి..’ అంటూ ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని