నేరచరిత్ర ఉందా.. మీకే టికెట్‌!

వైకాపా ప్రకటించిన అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల్లో నేరచరితులకే పెద్దపీట వేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్నవారితోపాటు, హత్య కేసుల్లో నిందితులు, గతంలో హత్యాయత్నం కేసులు నమోదైనవారికీ వైకాపా టికెట్లిచ్చింది.

Published : 17 Mar 2024 04:34 IST

 సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితులూ వైకాపా అభ్యర్థులే
హత్యకేసులు ఉన్నవారు, ఎర్రచందనం స్మగ్లర్‌కూ ఛాన్స్‌

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రకటించిన అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల్లో నేరచరితులకే పెద్దపీట వేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్నవారితోపాటు, హత్య కేసుల్లో నిందితులు, గతంలో హత్యాయత్నం కేసులు నమోదైనవారికీ వైకాపా టికెట్లిచ్చింది. ఎర్రచందనం స్మగ్లర్‌కు కూడా వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఛాన్స్‌ ఇచ్చారు. అభ్యర్థుల్లో.. దాడులు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు చేసినవారి సంఖ్య భారీగానే ఉంది.

సీఎం జగన్‌తో మొదలుకొని..

  • పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి, సీఎం జగన్‌పై 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులున్నాయి. వీటన్నింటిలోనూ ఆయనే ప్రథమ ముద్దాయి (ఏ1).  ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
  • చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం రవాణాకు సంబంధించి పలు స్టేషన్లలో గతంలో కేసులు నమోదయ్యాయి. 2014లో ఆయనపై పీడీ యాక్ట్‌ అమలు చేసి, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పంపారు.
  • అనంతపురం జిల్లా తాడిపత్రి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, సత్యసాయి జిల్లా ధర్మవరం అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిలపై గతంలో హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
  • విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి, ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై గతంలో భూ కబ్జా కేసు ఉంది.
  • మంత్రి జోగి రమేశ్‌ గతంలో ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపై దాడి చేశారు. అందుకు బహుమానంగా అన్నట్లు ఆయనకు సీఎం జగన్‌ మంత్రి పదవి కట్టబెట్టారు. ఇప్పుడు పెనమలూరు నుంచి అభ్యర్థిగా నిలిపారు.
  •  విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్‌ అనుయాయులు కొంతకాలం కిందట మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు.
  •  నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై 11 సీబీఐ, 9 ఈడీ కేసులు ఉన్నాయి. సీఎం జగన్‌తోపాటు ఆయన అక్రమాస్తుల కేసులన్నింటిలోనూ విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్నారు. ఈయన కూడా బెయిల్‌పైనే ఉన్నారు.
  • రాజంపేట లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డిపై రేణిగుంట విమానాశ్రయంలో సిబ్బందిపై దౌర్జన్యం కేసు ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని