పాడా ఓఎస్డీపై విచారణకు ఈసీ ఆదేశం

సీఎం జగన్‌ ఇలాకాలోని పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పాడా) ఓఎస్డీగా అయిదేళ్ల నుంచి పనిచేస్తున్న అనిల్‌కుమార్‌రెడ్డిపై ఎన్నికల సంఘం(ఈసీ) విచారణకు ఆదేశించింది.

Published : 27 Mar 2024 04:46 IST

వైకాపాతో అంటకాగుతున్నారని బీటెక్‌ రవి ఫిర్యాదు

ఈనాడు, కడప: సీఎం జగన్‌ ఇలాకాలోని పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పాడా) ఓఎస్డీగా అయిదేళ్ల నుంచి పనిచేస్తున్న అనిల్‌కుమార్‌రెడ్డిపై ఎన్నికల సంఘం(ఈసీ) విచారణకు ఆదేశించింది. ఆయన వైకాపా నాయకులతో అంటకాగుతున్నారని పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి ఈ నెల 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ చర్యలకు ఉపక్రమించింది. వెంటనే విచారణ జరిపి 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ జిల్లా అధికారులను మంగళవారం ఆదేశించింది. ‘అనిల్‌కుమార్‌రెడ్డి పాడా ఓఎస్డీగా అయిదేళ్ల నుంచి పని చేస్తున్నారు. ఇటీవలే ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌ హోదా కూడా కల్పించింది. జగన్‌ పులివెందుల నుంచి పోటీ చేస్తున్నందున అనిల్‌కుమార్‌రెడ్డి ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన్ను పులివెందుల నుంచి బదిలీ చేయాలి’ అని బీటెక్‌ రవి ఫిర్యాదులో కోరారు. దీనిపై స్పందించిన ఈసీ విచారణకు ఆదేశించింది. అలాగే కడప స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ అశోక్‌రెడ్డిపై కూడా రవి ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని