Serum Institute: ఆక్సఫర్డ్‌ బయో మెడికాలో సీరం పెట్టుబడి..!

దేశీయ వ్యాక్సిన్‌ తయారీ దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఇండియా యూకేకు చెందిన టీకా సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టింది. మొత్తం 68.24 మిలియన్‌ డాలర్లను తమ సంస్థలో పెట్టుబడిగా

Published : 22 Sep 2021 22:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ వ్యాక్సిన్‌ తయారీ దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఇండియా యూకేకు చెందిన టీకా సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టింది. మొత్తం 68.24 మిలియన్‌ డాలర్లను తమ సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్లు ఆక్స్‌ఫర్డ్‌ బయోమెడికా బుధవారం వెల్లడించింది. ఈ సంస్థ సెల్‌ థెరపీకి సంబంధించిన ఔషధాలు తయారు చేస్తుంది. ఈ నిధులతో ఆక్స్‌బాక్స్‌ప్లాంట్‌లో సంస్థ విస్తరణకు వినియోగిస్తుంది. ప్రస్తుతం ఆక్స్‌బాక్స్‌ ప్లాంట్లో కొవిడ్‌ టీకాలను తయారు చేస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చే స్థలంలో మరిన్ని వైరల్‌ వెక్టార్‌ ఉత్పత్తుల తయారీకి వీలుంది. 

ఈ సంస్థకు ఆక్సఫర్డ్‌లో 84వేల చదరపు అడుగుల్లో తయారీ యూనిట్‌ ఉంది.  తాజా పెట్టుబడులతో తయారీ నిబంధనలను మరింత మెరుగ్గా అమలు చేసేలా ఈ యూనిట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇవి 2023 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ డీల్‌ ప్రకారం సీరం సంస్థకు ఆక్సఫర్డ్‌ బయోమెడికాలో 3.9శాతం వాటాలు దక్కనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని