8న ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..

Aadhar Housing Finance IPO: రూ.3,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీఓ రానుంది. ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది.

Published : 02 May 2024 20:01 IST

దిల్లీ: ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ పెట్టుబడులున్న ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా గరిష్ఠ ధర వద్ద రూ.3,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. షేరు ధరల శ్రేణిని రూ.300-315గా నిర్ణయించారు. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఇష్యూ 7న ప్రారంభం అవుతుంది. ఇష్యూలో భాగంగా రూ.1,000 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో ప్రమోటరు బీసీపీ టోప్కో 7 పీటీఈ లిమిటెడ్‌ రూ.2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. 

ప్రస్తుతం ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్‌ గ్రూపునకు చెందిన బీసీపీ టోప్కోకు 98.72 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌కు 1.18 శాతం వాటాలున్నాయి. ఐపీఓలో తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల నుంచి రూ.750 కోట్లను ఇకపై రుణాలిచ్చేందుకు అవసరమయ్యే మూలధనం కోసం, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించనుంది. ఐపీఓలో అందుబాటులో ఉన్న మొత్తం షేర్లలో దాదాపు సగం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు, 35 శాతం రిటైల్‌ మదుపర్లకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించారు.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్‌ షురూ.. స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవిగో.

తనఖా సంబంధిత రుణాలు, రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలు, హోమ్‌ ఇంప్రూమెంట్‌ కోసం రుణాలను అందించే సంస్థే ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌. ఈ సంస్థకు 2023 సెప్టెంబరు 30 నాటికి దేశంలో 471 శాఖలు ఉన్నాయి. ఈ ఐపీఓకు ఈ నెల ప్రారంభంలోనే సెబీ అనుమతినిచ్చింది. ఎస్‌బీఐ సెక్యూరిటీస్‌, సిటీగ్రూప్‌ గ్లోబల్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ నోమూరా ఫైనాన్సియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

  • కీలక తేదీలు..
  • ఐపీఓ తేదీలు: మే 8- 10
  • ధరల శ్రేణి: రూ.300-315
  • అలాట్‌మెంట్ తేదీ: మే 13
  • రిఫండ్‌ తేదీ: మే 14
  • లిస్టింగ్‌ తేదీ: మే 15
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని