RINL: విస్తృత సంప్రదింపుల తర్వాతే స్టీల్‌ ప్లాంట్‌పై ముందుకు: కేంద్రం

Vizag steel plant: వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపుల అనంతరమే ముందుకు వెళతామని కేంద్రం పార్లమెంట్‌కు తెలియజేసింది.

Published : 19 Dec 2023 17:49 IST

Vizag steel plant | దిల్లీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై విస్తృత స్థాయి సంప్రదింపుల అనంతరమే ముందుకు వెళ్లనున్నట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలియజేసింది. వ్యూహాత్మక విక్రయానికి భాగస్వామ్యపక్షాలతో చర్చించిన అనంతరమే ఆసక్తి వ్యక్తీకరణలను (EOI) ఆహ్వానిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RINL)ను నూరు శాతం విక్రయానికి 2021 జనవరిలోనే కేబినెట్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని గుర్తు చేశారు.

‘‘విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీకి ఒక రూపు తెచ్చేందుకు విస్తృత స్థాయిలో సంప్రదింపులు అవసరం. ఈ లావాదేవీలో భూములు, ఇతర ఆస్తులు కూడా విక్రయించనున్నాం. వివిధ భాగస్వామ్యపక్షాలతో చర్చల అనంతరం ఆసక్తి వ్యక్తీకరణలు ఆహ్వానిస్తాం’’ అని కరాడ్‌ పేర్కొన్నారు. ఉద్యోగులు, యూనియన్ల వల్లే ఆలస్యం అవుతోందా? అనే ప్రశ్నకూ కరాడ్‌ సమాధానం ఇచ్చారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా, ఎయిరిండియా అనుబంధ ఏఐ అసెట్‌ హోల్డింగ్‌ విక్రయానికి కేబినెట్‌ ఆమోదం లభించినప్పటికీ.. ఈ మూడింటి విషయంలోనూ EOI ఆహ్వానించలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని