ఓలా కొత్త విద్యుత్‌ స్కూటర్లు,బైౖకులు

ఓలా ఎలక్ట్రిక్‌ సరికొత్త ప్రారంభ స్థాయి విద్యుత్‌ స్కూటర్‌ ఎస్‌1ఎక్స్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని పరిచయ ధర రూ.79,999 గా తెలిపింది.

Published : 16 Aug 2023 03:59 IST

పరిచయ ధర రూ.79,999

దిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌ సరికొత్త ప్రారంభ స్థాయి విద్యుత్‌ స్కూటర్‌ ఎస్‌1ఎక్స్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని పరిచయ ధర రూ.79,999 గా తెలిపింది. ఈ స్కూటర్‌ ఎస్‌1ఎక్స్‌ (2 కిలోవాట్‌ బ్యాటరీ), ఎస్‌1ఎక్స్‌ (3 కిలోవాట్‌ బ్యాటరీ), ఎస్‌1ఎక్స్‌+ (3 కిలోవాట్‌ బ్యాటరీ) వేరియంట్లుగా లభించనుంది. ఎస్‌1ఎక్స్‌ (2 కిలోవాట్‌ బ్యాటరీ) వేరియంట్‌ మొదటి వారం రూ.79,999కు లభిస్తుందని, అనంతరం ధర రూ.89,999 కానుందని ఓలా సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ తెలిపారు. బుకింగ్స్‌ ప్రారంభించామని, డిసెంబరు నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రోజుకు దాదాపు 10-20 ప్రయాణాల కోసం వీలుగా ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు వివరించారు.

  • ఎస్‌1ఎక్స్‌ (3 కిలోవాట్‌ బ్యాటరీ) వేరియంట్‌ మొదటి వారం రూ.89,999కు లభిస్తుంది. అనంతరం దీని ధర రూ.99,999 కానుంది.
  • ఎస్‌1ఎక్స్‌+ స్కూటర్‌ మొదటి వారం రోజుల పాటు రూ.99,999, అనంతరం రూ.1,09,999కు లభించనుంది. సెప్టెంబరు చివరి నుంచి వీటి డెలివరీలు ప్రారంభించనున్నారు.
  • ఎస్‌1ఎక్స్‌, ఎస్‌1ఎక్స్‌+ మధ్య సాఫ్ట్‌వేర్‌, అనుసంధానత ఫీచర్లలో మార్పులు ఉంటాయని భవీష్‌ తెలిపారు. ఎస్‌1ఎక్స్‌ ఒకసారి ఛార్జింగ్‌తో 151 కి.మీ నడుస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 90 కి.మీ.

రెండో తరం ఎస్‌1ప్రో: ఓలా ఎలక్ట్రిక్‌ రెండో తరం ఎస్‌1ప్రో స్కూటర్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.1,47,999 (ఎక్స్‌-షోరూమ్‌). సెప్టెంబరు మధ్య నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. కొత్త స్కూటర్లతో కలిపి ఓలా విద్యుత్తు వాహనాల్లో ఎస్‌1ఎక్స్‌ (2 కి.వా), ఎస్‌1ఎక్స్‌, ఎస్‌1ఎక్స్‌+, ఎస్‌1ఎయిర్‌, ఎస్‌1ప్రో మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.89,999 నుంచి రూ.1.47 లక్షల మధ్య ఉన్నాయి.

వచ్చే ఏడాది మోటార్‌సైకిళ్లు:  ఓలా ఎలక్ట్రిక్‌, 4 విద్యుత్తు మోటార్‌సైకిళ్లు డైమండ్‌హెడ్‌, అడ్వెంచర్‌, రోడ్‌స్టర్‌, క్రూయిజర్‌లను కూడా ప్రదర్శించింది. 2024 చివరకు వీటిని విపణిలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని