ప్రయాణ దూరాన్ని బట్టి ఇండిగో ఇంధన ఛార్జీ

విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో, సంస్థపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు టికెట్‌ ధరలపై ఏటీఎఫ్‌ ఛార్జీ విధిస్తున్నట్లు దేశీయ అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో వెల్లడించింది.

Published : 07 Oct 2023 02:13 IST

దిల్లీ: విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో, సంస్థపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు టికెట్‌ ధరలపై ఏటీఎఫ్‌ ఛార్జీ విధిస్తున్నట్లు దేశీయ అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో వెల్లడించింది. విమాన ప్రయాణ దూరాన్ని బట్టి ఇది ప్రతి టికెట్‌పై రూ.300-1000 వరకు ఉంటుందని, ఈనెల 6  నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు స్టాక్‌ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. గత 3 నెలలుగా ఏటీఎఫ్‌ ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ ఉన్నందునే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది.

విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఏటీఎఫ్‌ వాటాయే 40-45 శాతం ఉంటుంది. వరుసగా ఇంధన ధరలు పెరుగుతున్నందున, టికెట్‌ ధరలను ఈ మేరకు సవరించాలని భావిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. తమ విమానాల్లో టికెట్‌ కొనుగోలు చేసుకునేవారికి, ఆయా మార్గాల్లో ప్రయాణించే దూరానికి అనుగుణంగా ఈ ఛార్జీ మారుతుందని వివరించింది.  విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో అధిక ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. ఆకాశంలో తగిన ఎత్తుకు చేరాక ప్రయాణించేప్పుడు కాస్త తక్కువగానే ఇంధనం వినిమయమవుతుంది. అందుకనుగుణంగా దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే వారికి ఇంధన ఛార్జీ అమలు చేస్తామని ఇండిగో వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని