చైనాలో ఎలాన్‌ మస్క్‌

అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు.

Published : 29 Apr 2024 02:08 IST

బీజింగ్‌: అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. చైనాలో విద్యుత్తు కార్లకు గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో, టెస్లాకు చెందిన అత్యాధునిక అటానమస్‌ డ్రైవింగ్‌ సాంకేతికతను ప్రవేశ పెట్టేందుకే మస్క్‌ సన్నాహాలు చేస్తున్నారని భావిస్తున్నారు. చైనా ప్రీమియర్‌ లి చియాతో మస్క్‌ ఆదివారం సమావేశమైన మస్క్‌, దేశంలో తమ వాహన సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించడంపై సంప్రదింపులు జరిపారు. విదేశీ పెట్టుబడులకు చైనా ఎప్పుడూ అనుకూలమేనని మస్క్‌తో చియా చెప్పినట్లు సమాచారం. అమెరికా, చైనాలు రెండింటికి ప్రయోజనం ఉండేలా, పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయంగా ఉన్న తన ప్లాంట్లలో చైనా ప్లాంటు బాగా రాణిస్తోందని మస్క్‌ వివరించారు. చైనాలో 2020లో 7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.58000 కోట్ల) పెట్టుబడులతో మస్క్‌ తమ టెస్లా ప్లాంటును నిర్మించారు. భారత్‌లో పర్యటించి, ప్లాంటు నెలకొల్పే విషయమై ప్రకటన చేస్తారని భావించిన మస్క్‌ దానిని రద్దు చేసుకుని, చైనాకు వెళ్లడం గమనార్హం. గత ఏడాదిలో చైనాలో టెస్లా కార్లు 6 లక్షలకు పైగా అమ్ముడయ్యాయి. గత గురువారం బీజింగ్‌ ఆటోషో ప్రారంభం కాగా, సరిగ్గా ఇదే సమయంలో మస్క్‌ చైనా పర్యటన జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని