Retirement: 50 ఏళ్లకే రిటైర్‌.. తర్వాత ఎలా? నితిన్‌ కామత్‌ సూచనలు

ఒకప్పటిలాగా 60 ఏళ్లు పనిచేసి, పదవీ విరమణ చేసే రోజులు కావివి. ఆధునిక యువత 50 ఏళ్లకే ఉద్యోగం మానేసి, తమకు నచ్చినట్లుగా జీవించేందుకు సిద్ధం అవుతున్నారు. వైద్యపరమైన పురోగతి కారణంగా ఆయుర్దాయం 80కి చేరింది.

Updated : 11 Nov 2022 17:42 IST

కప్పటిలాగా 60 ఏళ్లు పనిచేసి, పదవీ విరమణ చేసే రోజులు కావివి. ఆధునిక యువత 50 ఏళ్లకే ఉద్యోగం మానేసి, తమకు నచ్చినట్లుగా జీవించేందుకు సిద్ధం అవుతున్నారు. వైద్యపరమైన పురోగతి కారణంగా ఆయుర్దాయం 80కి చేరింది. పదవీ విరమణ తర్వాత మిగతా 30 ఏళ్లు ఎలా జీవించాలి.. ఇదే విషయంపై ఆన్‌లైన్‌ బ్రోకరేజీ ప్లాట్‌ఫాం జెరోధా సహ-వ్యవస్థాపకుడు నితిన్‌ కామత్‌ ట్విటర్‌ వేదికగా జెన్‌-జెడ్‌ (25 ఏళ్ల లోపు వారికి) యువతకు కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు. అవేమిటంటే...

‘50 - 80 ఏళ్లు.. ఈ దశలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలి. ఒకప్పుడు పదవీ విరమణ నిధి కోసం స్థిరాస్తులు, స్టాక్‌ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు తోడ్పడ్డాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేద’ని అభిప్రాయపడ్డారు.

నితిన్‌ ఇంకా ఏం చెబుతున్నారంటే..

  1. మీకు అప్పు ఇవ్వడానికి ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. వారి వలలో చిక్కుకోవద్దు. అవసరం లేని వస్తువులు కొనడానికి రుణాలు తీసుకోవద్దు. విలువ తగ్గే వస్తువులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.
  2. పొదుపును వీలైనంత తొందరగా ప్రారంభించండి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, జీ-సెక్యూరిటీలు, ఇండెక్స్‌ ఫండ్లు/ఈటీఎఫ్‌లలో క్రమానుగత పెట్టుబడి (సిప్‌) ఇలా వైవిధ్యంగా మదుపు చేయండి. దీర్ఘకాలిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు షేర్లు ఇప్పటికీ మంచి మార్గమే.
  3. వ్యక్తిగతంగానూ, కుటుంబం అంతటికీ వర్తించేలా ఒక సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ తీసుకోండి. చాలామంది ఆర్థికంగా కొన్నేళ్లు వెనక్కి వెళ్లడానికి కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యం కారణం అయిన సందర్భాలున్నాయి. యాజమాన్యం నుంచి అందే బృంద బీమాతో పాటు, సొంతంగా ఒక పాలసీని తీసుకోవడం తప్పనిసరి.
  4. మీపై ఆధారపడిన వారుంటే.. తప్పనిసరిగా తగిన మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోండి. అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు పాలసీ నుంచి వచ్చిన డబ్బును ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మదుపు చేసినా, కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చేలా ఉండాలి.
  5. తొందరగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలంటే రుణాలు తీసుకోవడం ఆపేయాలి.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని