Zepto: చిటికేసి... వేల కోట్లు సృష్టించిన చిన్నోళ్లు!
ఇంకా వయసు 20 దాటలేదు... చదువు పూర్తి కాలేదు....అలాంటి వారు... అప్పటికే మార్కెట్లో 20 ఏళ్ల అనుభవమున్నవారిని ఇంటర్వ్యూ చేస్తుంటే వచ్చిన వారికి అనుమానం! ఈ కుర్రాళ్లా మా సామర్థ్యాన్ని నిర్ణయించేదని? వీళ్లా మాకు కొలువిచ్చేదని? ఆ
ఇంకా వయసు 20 దాటలేదు... చదువు పూర్తి కాలేదు....
అలాంటి వారు... అప్పటికే మార్కెట్లో 20 ఏళ్ల అనుభవమున్నవారిని ఇంటర్వ్యూ చేస్తుంటే వచ్చిన వారికి అనుమానం! ఈ కుర్రాళ్లా మా సామర్థ్యాన్ని నిర్ణయించేదని? వీళ్లా మాకు కొలువిచ్చేదని? ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ... 19 ఏళ్ల భారతీయ కుర్రాళ్లిద్దరూ దూసుకుపోయారు. ఏడాదిలో ఏకంగా రూ.7వేల కోట్లకుపైగా విలువైన కంపెనీని సృష్టించి సంచలనం రేపారు. వెయ్యి కోట్ల సంపద కూడబెట్టి తాజాగా భారత్‌లో బిలియనీర్ల క్లబ్లో చేరిన అత్యంత పిన్న వయస్కులయ్యారు! వారే... కైవల్య వోహ్రా, అదిత్ పలీచా! పెట్టిన కంపెనీ... జెప్టో!
జెప్టో అంటే సమయాన్ని కొలిచే అత్యంత చిన్న కొలమానం. చిటికె వేసే కాలం అనుకోవచ్చు. అంటే కచ్చితంగా అంతేగాకున్నా... అతి తక్కువ సమయంలో ఇంటికి కిరాణా, ఇతరత్రా సామగ్రిని అందించే ఈ కంపెనీకి ఇంతకంటే సరైన పేరు ఉండదేమో!
స్టాన్‌ఫర్డ్ చదువు వదిలేసి...
విదేశీ విద్యకు ఉవ్విళ్లూరుతున్న ఈతరంలో... ఎవరైనా స్టాన్‌ఫర్డ్‌లో చదువును మధ్యలోనే వదులుకుంటారా? అంతా నడిచే దారిలో నడవరు కాబట్టే... కైవల్య, అదిత్‌లు స్టాన్‌ఫర్డ్‌లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువును వదిలేసుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. బెంగళూరులో జన్మించిన కైవల్య దుబాయ్ కాలేజీలో చదివాడు. గణితం, కంప్యూటర్ సైన్స్‌తో పాటు హిందీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో నైపుణ్యముంది. అదిత్ ముంబయిలో పుట్టి పెరిగాడు. దుబాయ్‌లో చదివాడు. స్టాన్‌ఫర్డ్‌కు వెళ్లటానికి ముందే... 17 ఏళ్ల వయసులోనే గోపూల్ పేరుతో... విద్యార్థులకు కార్ల పూలింగ్ స్టార్టప్ ఆరంభించాడు. ప్రైవసీ పాలసీలకు సంబంధించిన కృత్రిమ మేధ ప్రాజెక్టు ప్రైవసీ కూడా అదిత్ సొంతం. ఇద్దరూ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదవటానికి విశ్వవిఖ్యాత స్టాన్‌ఫర్డ్ కాలేజీకి వెళ్లారు. కానీ కరోనా లాక్డౌన్ వేళ తట్టిన ఐడియా... వారి జీవితాన్నే మలుపు తిప్పింది. స్టాన్‌ఫర్డ్ చదువుకు మధ్యలోనే ఫుల్స్టాప్ పెట్టి డ్రాపౌట్లుగా మారారు.
కరోనా కష్టం రాత మార్చింది
2020 కరోనా లాక్డౌన్ సమయంలో ముంబయిలో కిరాయి అపార్ట్మెంట్లో ఉన్న వీరిద్దరూ... చాలామంది సామాన్యుల మాదిరిగానే నిత్యావసర సరకులకు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందే వేల కోట్ల కంపెనీగా రూపాంతరం చెందింది. తొలుత కైవల్య... కిరాణామార్ట్ పేరుతో ఈ స్టార్టప్ ఆరంభించాడు. తర్వాత అదిత్ చేరాడు. స్థానిక కిరాణా దుకాణాలతో ఒప్పందం కుదుర్చుకొని... తక్షణమే ఇళ్లకు సామగ్రిని చేర వేయటం మొదలెట్టారు. కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి తొలుత తమపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. ఆ అనుభవాలతో సరిదిద్దుకుంటూ వెళ్లారు.
విలువ రూ.7వేల కోట్లకుపైగా...
2021 ఏప్రిల్‌లో ముంబయిలో రూ.485.3 కోట్ల ఆరంభ ఫండింగ్‌ను ఆకర్షించి కార్యకలాపాలు ఆరంభించిన కంపెనీ ఇప్పుడు పదికిపైగా పట్టణాల్లో సుమారు 1500 మంది సిబ్బందితో విస్తరించి సేవలందిస్తోంది. ఈ కుర్రాళ్లిద్దరి చొరవ, ఆలోచన శక్తి, ప్రజల అవసరాలు తీరుస్తున్న వైనాన్ని చూసి... జెప్టో స్టార్టప్‌లో నెల తిరిగే సరికి మరో రూ.800 కోట్లు సమకూరాయి. ఈ ఏడాది మేలో రూ.1617 కోట్లు వచ్చాయి. తద్వారా... కంపెనీ విలువ రూ.7వేల కోట్లకుపైగా చేరింది. కిరాణా సామగ్రితో పాటు కాఫీ, టీ, చిరుతిళ్లులాంటివి కూడా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
‘2021 మార్చినాటికి పది నిమిషాల్లో వస్తువులు ఇంటికి చేర్చటం ఆశ్చర్యం కల్గించే ఆలోచన. పైగా... మమ్మల్ని చూసి అంతా అనుమానించారు. మాపై, మా ఆలోచనలపై నమ్మకం కల్గించటం మొదట్లో సవాలుగా మారింది. ‘చాలా స్టార్టప్‌లకు నిలదొక్కుకోవటానికి మూడు నుంచి 5 సంవత్సరాల కాలం పడుతుంది. కానీ మేం మాత్రం ఆరునెలల్లో బలంగా నిలబడ్డాం. సమర్థులైన 9 మందిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫోసిస్‌ల నుంచి నాయకత్వ స్థానాల్లో తీసుకున్నాం. మిగిలిన జట్టును నిర్మించాం. ఇప్పుడు మా ఆఫీసులో ఎవరూ మా వయసును గుర్తించరు. మీడియా మాత్రమే మేం ఇంకా 20 దాటలేదని గుర్తు చేస్తుంటుంది’ అన్నారు అదిత్, కైవల్య! తాజాగా... 2022 ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో ఈ ఇద్దరు కుర్రాళ్లు చేరారు. కైవల్య సంపద రూ.వెయ్యి కోట్లు; అదిత్ సంపద రూ.1200 కోట్లుగా తేలింది.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీపై పన్ను పడకుండా...
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? ఆదాయపు పన్ను పరిధిలో లేనప్పుడు మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) పడకుండా చూసుకుంటున్నారా? ఇందుకోసం ఏం చేయాలో తెలుసా? బ్యాంకు లేదా సంస్థల దగ్గర ఫారం 15జీ లేదా 15హెచ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మూలం వద్ద పన్ను కోత విధించరు. -
జీవిత బీమా.. మీ బాధ్యతలను తీర్చేలా
మీ నెలవారీ ఆదాయం కిరాణా సామగ్రి, బిల్లులు చెల్లించడం, పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులను తీర్చడంలో మీకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటుంది. మీ బడ్జెట్ ఖర్చులను పక్కన పెడితే.. మీ నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య అత్యవసర ఖర్చులు, పదవీ విరమణ ప్రణాళికలు, పిల్లల ఉన్నత విద్యలాంటి వాటి కోసం పొదుపు, మదుపు చేయాల్సిన అవసరమూ ఉంటుంది. -
బేరమాడితే తగ్గేను ప్రీమియం
కారు బీమా ఒక బాధ్యత. ఏడాదికోసారి దీన్ని పునరుద్ధరిస్తూనే ఉండాలి. అప్పుడే దీన్ని మీరు రోడ్డు మీద ఎలాంటి భయాలూ లేకుండా నడపగలరు. బీమా రక్షణ లేకుంటే.. అటు చట్టపరంగానూ, ఇటు ఆర్థికంగానూ చిక్కులు తప్పవు. -
నిఫ్టీ 50 షేర్లలో పెట్టుబడికి...
నవి మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక నిఫ్టీ 50 ఈటీఎఫ్ పథకాన్ని తీసుకొచ్చింది. నవీ నిఫ్టీ 50 ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ నేటితో ముగియనుంది. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.250. ఓపెన్ ఎండెడ్ పథకం. -
Elon Musk: బాల్యంలో కష్టాలు పడ్డా.. వదంతులకు చెక్ పెడుతూ మస్క్ పోస్ట్
Elon Musk: ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా అనేక విషయాలను పంచుకుంటుంటారు. అనేక మంది ట్వీట్లకు తన దైన శైలిలో స్పందిస్తుంటారు. ఇటీవల గనులపై వస్తున్న ఆరోపణలపై మరోసారి సుదీర్ఘ ట్వీట్ చేశారు. -
Mukesh Ambani: ముకేశ్ అంబానీ.. 20 ఏళ్ల ఇండస్ట్రీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ విస్తరణలో ముకేశ్ అంబానీ కీలక పాత్ర పోషించారు. తండ్రి మరణం తర్వాత కంపెనీ బాధ్యతలు చేపట్టిన ఆయన సంస్థను అనేక రంగాలకు విస్తరించారు. -
Retirement: 50 ఏళ్లకే రిటైర్.. తర్వాత ఎలా? నితిన్ కామత్ సూచనలు
ఒకప్పటిలాగా 60 ఏళ్లు పనిచేసి, పదవీ విరమణ చేసే రోజులు కావివి. ఆధునిక యువత 50 ఏళ్లకే ఉద్యోగం మానేసి, తమకు నచ్చినట్లుగా జీవించేందుకు సిద్ధం అవుతున్నారు. వైద్యపరమైన పురోగతి కారణంగా ఆయుర్దాయం 80కి చేరింది. -
Nellore: చదువు మానేసి.. చాయ్‌తో రూ.5 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన ఆ యువకుడు.. ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజ యూనివర్సిటీలో బీబీఏ (బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) చదివి.. మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. -
లక్ష కోట్లకు చేర్చిన ఉక్కు మహిళ!
తక్కువమంది ఎంచుకునే రంగంలో అడుగుపెట్టడానికి సంకోచించేవారే ఎక్కువ. అమ్మాయిలను చదివించడమే గొప్పనుకునే రోజుల్లో ఆ సాహసం చేశారు సోమ మోండల్. ఓ మహిళ.. నాయకురాలన్న ఊహే కష్టమైన వేళ ఆ స్థానాన్ని అధిరోహించారు. -
Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. భారత్‌లో ఈక్విటీ మదుపర్లకు బెంచ్‌మార్క్‌గా చెప్పుకునే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. -
Savitri Jindal: ఆసియా సంపన్న మహిళ.. సావిత్రి జిందాల్
ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్‌కు చెందిన సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్ గ్రూప్ ఛైర్పర్సన్ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్ -
తక్కువ నష్టానికీ వ్యూహాలు!
‘ప్రపంచమంతా అధిక ధరలతో.. ఆ ప్రభావం వల్ల ఏర్పడుతున్న మందగమనంలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో, మదుపర్లు.. ముఖ్యంగా తొలిసారి డబ్బులు పెడుతున్నవారు తక్కువగా నష్టపోయే వ్యూహాన్ని అనుసరించాల’ని స్విస్ పెట్టుబడిదారు,‘ది గ్లూమ్ బూమ్ డూమ్’ ఎడిటర్ మార్క్ ఫాబర్ సూచిస్తున్నారు. ‘అమెరికాలో వడ్డీరేట్లు అధికంగా పెంచబోరని, 6 నెలల్లో తగ్గించడం ప్రారంభం కావచ్చ’ని వార్తా సంస్థ ‘ఇన్ఫామిస్ట్’కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముఖ్యాంశాలివీ.. -
Gita Gopinath: ‘గీత’లు చెరిపేస్తూ.. మరో ఘనత సాధించిన గీతా గోపీనాథ్..!
ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF)కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులై రికార్డు సృష్టించారు భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్. -
దాన లక్ష్ములు!
‘నా సంపదలో సగం దానం చేస్తా’ రెండేళ్ల క్రితం మెకంజీ స్కాట్ మాట ఇది! అన్నట్టుగానే ఏటా ఆమె దానాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వచ్చారు. -
Microsoft India COO: జీవితం పిజ్జా లాంటిది.. ఆ ఐదూ ఉండాల్సిందే!
‘జీవితంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే!’ చాలామంది ప్రముఖులు ఆచరించే విజయసూత్రమిది. -
‘యూనికార్న్’ అంటే నమ్మలేకపోయా!
మహిళలు సాంకేతిక రంగంలో.. అదే విధంగా ఆర్థిక రంగంలో ఉండటం చూశాం. కానీ ఈ రెండూ కలగలసిన ఫిన్‌టెక్ రంగంలో మాత్రం చాలా అరుదు. -
జోడీ నెంబర్ 1
కంబైన్డ్ స్టడీతో మార్కులు కొల్లగొట్టిన విద్యార్థుల్ని చూశాం. సివిల్స్ సాధించిన భార్యాభర్తల గాథలు విన్నాం. -
ఆఫీసు బాయ్ నుంచి కోట్ల వ్యాపారం దాకా!
‘ఇది కాదు... ఇది కానే కాదు. నేను ఉండాల్సిన చోటు ఇది కాదు... నేను చేరుకోవాల్సిన గమ్యం ఇది కాదు... అందుకోవాల్సిన లక్ష్యం ఇంకా నా -
ఆ రోజు... చనిపోతాననుకున్నా!
గౌతమ్ అదానీ.. దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీతో పోటీపడుతున్న ఈ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు అధినేత. -
Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్లో స్టార్ తిరిగింది!
స్టాక్ మార్కెట్‌కూ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకూ విడదీయలేని సంబంధం ఉంది. ఆయన ఆస్తి విలువ రూ.35వేల కోట్లు.


తాజా వార్తలు (Latest News)
-
Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
-
Team India: ముగ్గురు కెప్టెన్లు.. భవిష్యత్తుకు సంకేతం కావచ్చు: ఇర్ఫాన్ పఠాన్
-
Manipur Violence: మణిపుర్లో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. 13 మంది మృతి
-
Yashasvi Jaiswal: బాదుడు సరే.. తొందరెందుకు యశస్వి.. కుదురుకోవాలి కదా!
-
Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసు కేసు
-
Chhattisgarh: రాజవంశీయులకు బై బై.. పోటీలో ఉన్న ఏడుగురూ ఓటమి!