Savitri Jindal: ఆసియా సంపన్న మహిళ.. సావిత్రి జిందాల్‌

ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్‌కు చెందిన సావిత్రి జిందాల్‌ అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్‌

Published : 30 Jul 2022 17:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్‌కు చెందిన సావిత్రి జిందాల్‌ అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్‌ డాలర్లు. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్‌ బిలియనర్స్‌ సూచీ వెల్లడించింది.

ఇప్పటివరకు ఈ జాబితాలో చైనాకు చెందిన దిగ్గజ స్థిరాస్తి సంస్థ కంట్రీ గార్డెన్‌ కో ఛైర్మన్‌ యాంగ్ హుయాన్‌ తొలి స్థానంలో కొనసాగారు. అయితే చైనాలో రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభం ఎఫెక్ట్‌తో ఏడాది కాలంలోనే యాంగ్ సంపద సగానికి పైగా తరిగిపోయింది. ఈ ఏడాది జనవరిలో యాంగ్ సంపద విలువ 23.7 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం 11బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. దీంతో ఆసియా సంపన్న మహిళ ర్యాంక్‌ను ఆమె కోల్పోవడమే గాక, ఈ జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు. 11.3 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో సావిత్రి జిందాల్‌ ఆసియా సంపన్న మహిళగా అగ్ర స్థానంలోకి చేరగా. చైనాకు చెందిన మరో బిజినెస్‌ టైకూన్‌ ఫాన్‌ హాంగ్‌వియ్‌ రెండో స్థానంలో ఉన్నారు.

72 ఏళ్ల సావిత్రి జిందాల్‌.. భారత్‌లోనే అత్యంత ధనిక మహిళ. దేశంలోని మొత్తం సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో ఉన్నారు. 2005లో జిందాల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు, సావిత్రి భర్త ఓపీ జిందాల్‌ విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత సంస్థ బాధ్యతలను సావిత్రి అందుకున్నారు. ఈ కంపెనీ దేశంలో మూడో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. స్టీల్‌తో పాటు సిమెంట్‌, ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని