నిఫ్టీ 50 షేర్లలో పెట్టుబడికి...

నవి మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ పథకాన్ని తీసుకొచ్చింది. నవీ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ నేటితో ముగియనుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.250. ఓపెన్‌ ఎండెడ్‌ పథకం.

Updated : 15 Sep 2023 01:08 IST

వి మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ పథకాన్ని తీసుకొచ్చింది. నవీ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ నేటితో ముగియనుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.250. ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. నిఫ్టీ 50 ఇండెక్స్‌ను ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ఇది నవీ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చిన తొలి ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ పథకం(ఈటీఎఫ్‌). దీనికి ఆదిత్య ముల్కి, అశుతోష్‌ షిర్వాయ్‌కర్‌ ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ఇప్పటికే వివిధ మ్యూచువల్‌ ఫండ్లు నిర్వహిస్తున్న ఈటీఎఫ్‌ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌ఓ ముగిసిన తర్వాతా ఈటీఎఫ్‌ పథకాల యూనిట్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేసేందుకు, విక్రయించేందుకు అవకాశం ఉండటం ఒక ముఖ్యమైన సానుకూలత. అదే సమయంలో ఈటీఎఫ్‌ పథకాల నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయి. నిఫ్టీ 50 షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ఉన్న మదుపరులకు నవీ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ అనుకూలంగా ఉంటుంది.


ఫార్మా, ఆరోగ్య సేవల సంస్థల్లో

దేశంలోని అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, ఫార్మా-ఆరోగ్య సేవల రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం హెచ్‌డీఎఫ్‌సీ ఫార్మా అండ్‌ హెల్త్‌కేర్‌ ఫండ్‌ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 28. న్యూ ఫండ్‌ ఆఫర్‌లో కనీస పెట్టుబడి రూ.100. ఇది సెక్టోరియల్‌/థీమ్యాటిక్‌ విభాగానికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. దాదాపు 80 శాతం నిధులను ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాలకు చెందిన కంపెనీల్లో మదుపు చేస్తుంది. ఇటీవలి కాలంలో ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాలు దేశీయంగా విస్తరిస్తున్నాయి. ఈ రంగంలోని కంపెనీలు అధిక ఆదాయాలు, లాభాలు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని, ఈ పథకాన్ని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచవల్‌ ఫండ్‌ ఆవిష్కరించినట్లు స్పష్టమవుతోంది. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ను ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని