IRCTC Tour package: అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ప్యాకేజీ వివరాలు ఇవిగో..
Hyderabad to Andaman IRCTC Tour package: ఈ వేసవి సెలవుల్లో అండమాన్ నికోబార్ దీవులను సందర్శించాలనుకుంటే ఐఆర్సీటీసీ అందించే ఈ టూరిజం ప్యాకేజీపై లుక్కేయండి..
ఈ వేసవి సెలవుల్లో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఓ వైపు సముద్ర అందాలు.. ఇసుక తిన్నెలు.. పచ్చని చెట్ల మధ్య సేద తీరాలని చూస్తున్నారా? అయితే, ఐఆర్సీటీసీ అండమాన్ టూర్ ప్యాకేజీపై లుక్కేయాల్సిందే. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంతో మొదలై పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్లడం.. అక్కడి అందాలు వీక్షించాక తిరిగి హైదరాబాద్‌కు విమానంలో చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది. మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు సాగే ఈ ప్యాకేజీ మే 26న ప్రారంభం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ప్యాకేజీ వివరాలు చూద్దాం పదండి..
ట్రిప్ సాగేదిలా..
Day 1: మే 26న ఉదయాన్నే హైదరాబాద్ (Hyderabad) నుంచి విమాన ప్రయాణంతో జర్నీ ప్రారంభమవుతుంది. ప్రయాణికులంతా ఉదయం 4.35 గంటలకే విమానాశ్రయానికి చేరుకోవాలి. 6.35కి హైదరాబాద్‌లో విమానం ప్రారంభమై 9.15కి పోర్ట్‌బ్లెయిర్ (Port Blair) చేరుకుంటుంది. ముందుగానే బుక్ చేసిన హోటల్లో బస ఉంటుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సెల్యూలర్ జైల్ మ్యూజియం, కోర్బికోవ్ బీచ్ సందర్శన ఉంటుంది. రాత్రి సెల్యులర్ జైల్ వద్ద నిర్వహించే లైట్ అండ్ సౌండ్ షో వీక్షించవచ్చు. రాత్రి పోర్ట్‌బ్లెయిర్‌లోనే బస ఉంటుంది.
Day2: రెండో రోజు ఉదయం హేవ్‌లాక్ దీవికి (Havelock Island) ఓడలో ప్రయాణం ఉంటుంది. అల్పాహారం ప్యాక్ చేసి అందిస్తారు. హేవ్‌లాక్ చేరుకున్నాక హోటల్ గదిలో బస ఉంటుంది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత రాధానగర్ బీచ్ సందర్శన ఉంటుంది. హేవ్‌లాక్ దీవిలోనే రాత్రి బస ఉంటుంది.
Day3: మూడో రోజు హేవ్‌లాక్ నుంచి నెయిల్ దీవికి (Neil Island) బయల్దేరాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం అనంతరం కాలాపత్తర్ బీచ్‌కు వెళ్లి అక్కడి నుంచి నెయిల్ దీవికి ఓడలో ప్రయాణం ఉంటుంది. అక్కడ మళ్లీ హోటల్లో బస ఉంటుంది. సాయంత్రం లక్ష్మణ్పూర్లో సూర్యాస్తమయం చూడొచ్చు. హోటల్లోనే రాత్రి బస ఉంటుంది.
Day4: నాలుగో రోజు నెయిల్ దీవి నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు పయనం అవ్వాల్సి ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం భరత్‌నగర్ బీచ్ సందర్శన ఉంటుంది. అక్కడ స్విమ్మింగ్, గ్లాస్ బాటమ్ బోట్ రైడ్, ఇతర వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. ఆ తర్వాత పోర్ట్‌బ్లెయిర్‌కి పయనం అవ్వాలి. రాత్రికి మళ్లీ పోర్ట్బ్లెయిర్లో బస ఉంటుంది.
Day 5: ఐదో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత రాస్ ఐలాండ్‌లో కాస్త సమయం గడిపాక.. నార్త్ బే ఐల్యాండ్‌కు తీసుకెళతారు. అక్కడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనొచ్చు. పోర్ట్‌బ్లెయిర్‌లోనే మధ్యాహ్నం భోజనం ఉంటుంది. తర్వాత సాముద్రిక మెరైన్ మ్యూజియం వీక్షణ ఉంటుంది. సాయంత్రం షాపింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. రాత్రి మళ్లీ పోర్ట్‌బ్లెయిర్‌లోనే హోటల్లో బస ఉంటుంది.
Day 6: పోర్ట్‌బ్లెయిర్ నుంచి ఉదయం 7.55 గంటలకు విమానాశ్రయానికి చేరుకోవాలి. ఉదయం 9.55 గంటలకు విమానం బయల్దేరుతుంది. మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు
- సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.55,780
- డబుల్ ఆక్యుపెన్సీ: రూ.43,170
- ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.42,885
- చైల్డ్ విత్ బెడ్ (5-11ఏళ్లు): రూ.38,600
- చైల్డ్ విత్ ఆర్ వితౌట్ బెడ్ (2-11ఏళ్లు): 35,200
- రెండేళ్లలోపు చిన్నారులకు రూ.1500 వరకు ఛార్జీ ఎయిర్పోర్ట్ కౌంటర్ల వద్ద చెల్లించాల్సి ఉంటుంది.
ప్యాకేజీలో ఉండేవి..
- హైదరాబాద్ నుంచి పోర్ట్‌బ్లెయిర్.. పోర్ట్ బ్లెయిర్ నుంచి హైదరాబాద్ విమాన టికెట్లు
- ఏసీ గదులు
- పర్యటనలో ఒక చోటు నుంచి మరో చోటుకు ఏసీ వాహనాల్లో ప్రయాణం
- నెయిల్, హేవ్‌లాక్, నార్త్‌బే ఐలాండ్‌కు ఓడ ప్రయాణ ఖర్చులు
- 4 రోజుల పాటు ఉదయం పూట టిఫిన్, 5 రోజుల పాటు రాత్రి డిన్నర్ ప్యాకేజీలో భాగంగా అందిస్తారు.
- ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్ ఉంటారు.
వీటి బాధ్యత ప్రయాణికులదే
- విమాన ప్రయాణ టికెట్ ధరల్లో మార్పు ఉంటే అధిక ధర ప్రయాణికులే చెల్లించాలి.
- హైదరాబాద్ విమానాశ్రయానికి రాకపోకల ఏర్పాట్లు యాత్రికులే చూసుకోవాలి.
- మధ్యాహ్నం పూట భోజన ఖర్చు యాత్రికులదే.
- విమాన ప్రయాణంలో మీల్స్ ఖర్చు ప్యాకేజీలో భాగం కాదు.
- వాటర్ స్పోర్ట్స్, ఇతర చూడదగిన ప్రదేశాల్లో టికెట్ల ఖర్చు ప్రయాణికులే భరించాలి.
ఇతర వివరాలు..
- ప్రయాణంలో ప్రతి ఒక్క ప్రయాణికుడు తమ వ్యక్తిగత గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.
- సమయాన్ని బట్టి సందర్శన స్థలాల్లో మార్పులు ఉండొచ్చు.
- ఏదైనా వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే.. ఐఆర్సీటీసీ అందుకు ఎట్టి బాధ్యతా వహించదు.
- ఒకవేళ ఏదైనా కారణంతో టికెట్ రద్దు చేసుకుంటే.. 7 రోజుల ముందు వరకు తిరిగి చెల్లింపులు ఉంటాయి. వారంలోపు అయితే ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు.
మరిన్ని వివరాలకు ఐఆర్సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించండి..
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
Digilocker: డిజీ లాకర్‌తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్‌గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్‌లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. -
Paytm పేమెంట్స్ బ్యాంక్‌లో ఈ సేవలకు.. మరికొన్ని రోజులే గడువు
Paytm payments bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో కొన్ని సేవలకు గడువు మార్చి 15తో ముగియనుంది. ఆ తర్వాత వాటిని కొనసాగించలేరు. -
Aadhaar Update: ఆధార్ ఉచిత అప్డేట్కు మరోసారి గడువు పొడిగింపు
ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్ తెలిపింది. -
ఆదాయపు పన్ను ఈ పొరపాట్లు చేయొద్దు
ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం. -
EPFO: పీఎఫ్ ఖాతాలో వివరాలు మార్చుకోవాలా? ఆన్లైన్లో సులువుగా..
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులా? మీ పీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలను మార్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఆన్లైన్ ఫారమ్‌తో సులువుగా మార్చుకోవచ్చు. -
Indian Railways: ట్రైన్ టికెట్ చిరిగిపోయిందా? అయితే ఇలా చేయండి!
train ticket lost: ట్రైన్ టికెట్ పోయిందా? ప్రయాణం ఎలా అని కంగారు పడుతున్నారా? అయితే రైల్వే అందిస్తున్న ఈ సదుపాయం గురించి తెలుసుకోవాల్సిందే.. -
Solar rooftop: ‘సూర్యఘర్’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?
PM Surya Ghar Muft Bijli Yojana: ఇంటిపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ ఇచ్చే పథకానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సబ్సిడీ ఎలా పొందాలి? -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరిస్తే
చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తేనే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. దీన్ని తట్టుకోవాలంటే.. ఆరోగ్య బీమా ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారింది. చాలామంది ఈ పాలసీని తీసుకుంటున్నప్పటికీ.. దీన్ని పూర్తిగా అర్థం చేసు కోవడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. -
FasTag: పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్నారా? ప్రత్యామ్నాయాలు ఇవే..!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌లు త్వరలో చెల్లుబాటుకాకుండా పోనున్నాయి. దీంతో కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలు ఇవీ.. -
PM Kisan: రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు ఎప్పుడంటే?
PM Kisan 16th installment: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. ఫిబ్రవరి 28వ తేదీన ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
పేటీఎం ఫాస్టాగ్‌లు ఏం చేయాలి? సౌండ్ బాక్స్‌ల మాటేంటి? RBI సమాధానాలివే..!
RBI releases Paytm FAQs: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించి వినియోగదారుల నుంచి తరచూ ఎదురవుతున్న ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. -
8 ఏళ్లలో రూ.45లక్షలు..
నాకు నెలకు రూ.55వేల వేతనం వస్తోంది. వయసు 38. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు లేవు. నేను ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? -
IPO: ఐపీఓకి దరఖాస్తు చేస్తుంటే
IPO: స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లు జోరు నడుస్తోంది. అనేక సంస్థలు ప్రజల నుంచి మూలధన నిధులను సమీకరించేందుకు ముందుకు వస్తున్నాయి -
PM Surya Ghar: ఉచిత విద్యుత్ పథకం.. ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం దరఖాస్తు ఇలా..
PM Surya Ghar- Muft Bijli Yojana: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్’ పథకం ప్రారంభించింది. దీని కింద ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం దరఖాస్తు చేసుకోండిలా..! -
Blue Aadhaar: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు? దరఖాస్తు ఎలా?
Blue Aadhaar Card: యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఆధార్ కార్డుల (Blue Aadhaar card)ను జారీ చేస్తోంది. దీన్ని బాల ఆధార్ (Baal Aadhaar) కార్డుగా వ్యవహరిస్తారు. -
Fastag KYC: ఫాస్టాగ్ కేవైసీ గడువు పొడిగించిన ఎన్హెచ్ఏఐ
ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువును పొడిగిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. ఫిబ్రవరి 29 వరకు వెసులుబాటు కల్పించింది. -
Cashless: ఇక అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్.. నేటి నుంచే అమల్లోకి
Cashless facility at all hospitals: దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘ది జనరల్ ఇన్సూరెన్స్’ కౌన్సిల్ వెల్లడించింది. -
FASTags: ఫాస్టాగ్‌కు కేవైసీ.. జనవరి 31 డెడ్‌లైన్!
కేవైసీ (KYC) పూర్తిచేయని ఫాస్టాగ్‌లు జనవరి 31, 2024 తర్వాత డీయాక్టివేట్ లేదా బ్లాక్ అవుతాయని ఎన్హెచ్ఏఐ ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా