Prepaid plans: వార్షిక ప్యాక్స్‌ కోసం చూస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ప్లాన్లు ఇవే..

Telecom Prepaid plans: జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ కంపెనీలు తమ యూజర్లకు ఏడాది వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లు అందిస్తున్నాయి. అపరిమిత కాలింగ్‌, డేటాతో పాటు ఓటీటీ ప్రయోజనాలనూ అందిస్తున్నాయి.

Updated : 04 Jan 2023 13:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతిసారీ రీఛార్జి చేసుకోవడం కంటే ఏడాది మొత్తానికీ ఒకేసారి రీఛార్జి చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఇంట్లో పెద్ద వాళ్లు ఉంటే వారికి ఈ ప్లాన్లు బాగా ఉపయోగపడతాయి. టెలికాం కంపెనీలు సైతం అలాంటి వారికి అనుగుణంగా లాంగ్‌టర్మ్‌ ప్లాన్లను అందిస్తున్నాయి. అపరిమిత కాలింగ్‌తో పాటు, డేటా, ఓటీటీ ప్రయోజనాలను సైతం ఇస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు దాదాపు ఏడాది, పూర్తి ఏడాది కాలవ్యవధి కలిగిన ప్లాన్లను ఇస్తున్నాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జియో మరో కొత్త ప్లాన్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇంతకీ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ కంపెనీలు వార్షిక ప్రాతిపదికన ఏయే ప్రీపెయిడ్‌ ప్లాన్లు అందిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..

జియో వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్లు

  • రూ.2545 ప్లాన్‌: వ్యాలిడిటీ 336 రోజులు; రోజుకు 1.5 జీబీ డేటా, మొత్తం 504 జీబీ డేటా; అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజూ 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు; జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌ వంటి జియో యాప్స్‌ ఉచితంగా లభిస్తాయి.
  • రూ.2879 ప్లాన్‌: 365 రోజలు వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా, మెత్తం 730 జీబీ డేటా; అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజూ 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు, జియో యాప్స్‌ ఫ్రీ
  • రూ.2999 ప్లాన్‌: 365+23 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2.5 జీబీ డేటా, మొత్తం 912.5 జీబీ డేటా; అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజూ 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు; జియో యాప్‌ బెనిఫిట్స్‌; జియో న్యూ ఇయర్‌ ఆఫర్‌లో భాగంగా ఈ ప్యాక్‌ను జియో అందిస్తోంది.

ఎయిర్‌టెల్‌

  • రూ.3359 ప్లాన్‌: వ్యాలిడిటీ 365 రోజులు; రోజుకు 2.5 జీబీ డేటా; అపరిమిత వాయిస్‌కాలింగ్‌, రోజూ 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు; ఏడాది కాలపరిమితితో అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌; ఉచిత వింక్‌ మ్యూజిక్‌, ఉచిత హలోట్యూన్‌, అపోలో 24/7 సర్కిల్‌, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌ వంటి  ప్రయోజనాలు అదనం.
  • రూ.2999 ప్లాన్‌: వ్యాలిడిటీ 365 రోజులు; రోజుకు 2 జీబీ డేటా; అపరిమిత వాయిస్‌ కాలింగ్‌; రోజూ 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు; ఏడాది కాలపరిమితితో ఉచిత వింక్‌ మ్యూజిక్‌, ఉచిత హలోట్యూన్‌, అపోలో 24/7 సర్కిల్‌, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలు పొందవచ్చు.
  • రూ.1799 ప్లాన్‌: 365 రోజుల వ్యాలిడిటీతో, 24 జీబీ డేటా, 3600 ఎస్సెమ్మెస్‌లు; ఎయిర్‌టెల్‌ను రెండో సిమ్‌గా వినియోగించే వారికి ఇది ఉపయోగం.

వొడాఫోన్‌ ఐడియా

  • రూ.3099 ప్లాన్‌: వ్యాలిడిటీ 365 రోజులు; రోజుకు 2 జీబీ డేటా; అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజూ 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు; ఏడాది కాలపరిమితితో ఉచిత వీఐ సినిమాలు, టీవీ, డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ వంటి ప్రయోజనాలు అదనం.
  • రూ.2899 ప్లాన్‌: 365 రోజుల వ్యాలిడిటీ; రోజుకు 1.5 జీబీ డేటా; అపరిమిత కాల్స్‌; రోజుకు 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు; ఏడాది కాలపరిమితితో ఉచిత వీఐ సినిమాలు, టీవీ వంటి ప్రయోజనాలు అదనం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని