Mahindra: ఏప్రిల్‌లో మహీంద్రా వాహన అమ్మకాలు 70,471 యూనిట్లు

2024 ఏప్రిల్‌లో మహీంద్రా వాహన అమ్మకాలు 13 శాతం పెరిగి 70,471 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది.

Published : 02 May 2024 18:13 IST

దిల్లీ: 2024 ఏప్రిల్‌లో మహీంద్రా మొత్తం (హోల్‌సేల్‌) అమ్మకాలు 13% పెరిగి 70,471 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో మొత్తం అమ్మకాలు 62,294 యూనిట్లు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయాణికుల వాహన అమ్మకాలు 18 శాతం పెరిగి 41,008 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఈ అమ్మకాలు 34,698 యూనిట్లు. మొత్తం ఎగుమతులు గత నెలలో 1,813 యూనిట్ల నుంచి 2 శాతం పెరిగి 1,857 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ ఏప్రిల్‌లో ట్రాక్టర్‌ విక్రయాలు 2 శాతం పెరిగి 37,039 యూనిట్లకు చేరాయని, గతేడాది ఇదే నెలలో విక్రయాలు 36,405 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని