Bank of Baroda: బీఓబీకి ఆర్‌బీఐ షాక్‌.. యాప్‌లో కొత్త కస్టమర్లు చేర్చుకోకుండా ఆంక్షలు

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా తన మొబైల్ అప్లికేషన్‌లో కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది.

Published : 10 Oct 2023 20:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda)కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) షాక్‌ ఇచ్చింది. తన మొబైల్‌ అప్లికేషన్‌ ‘బీఓబీ వరల్డ్‌’ (bob World)లో  కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా నిషేధం విధించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. పర్యవేక్షణ లోపాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

భారత్‌లో అంబానీయే అత్యంత ధనవంతుడు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 35A ప్రకారం దఖలు పడిన అధికారాలను వినియోగించి ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ‘బీఓబీ వరల్డ్‌’ అప్లికేషన్‌లో గుర్తించిన లోపాలను బ్యాంక్‌ సరిదిద్దడంతో పాటు, సంబంధిత చర్యల పట్ల ఆర్‌బీఐ సంతృప్తి చెందిన అనంతరమే కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న కస్టమర్లకు ఎటువంటి అంతరాయం లేకుండా యాప్‌ను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని బ్యాంకుకు ఆర్‌బీఐ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని