Retail inflation: కాస్త ఊరట! ఆగస్టులో స్వల్పంగా దిగొచ్చిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

Retail inflation in August: దేశీయంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. జులై నెలలో 7.4 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతానికి దిగొచ్చింది.

Published : 12 Sep 2023 19:02 IST

Retail inflation | దిల్లీ: దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం (Retail inflation) స్వల్పంగా దిగొచ్చింది. ఆగస్టులో 6.83 శాతంగా నమోదైంది. జులైలో ఇది 7.4 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే.  ఆహారపదార్థాల పదార్థాల ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం కాస్త దిగొచ్చింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం మంగళవారం గణాంకాలను (NSO) విడుదల చేసింది.

ఓ వైపు రిటైల్‌ ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ, కేంద్రప్రభుత్వం చేపడుతుండడంతో కొన్ని నెలలుగా రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. అయితే, కూరగాయల ధరలు పెరగడంతో జులైలో 15 నెలల గరిష్ఠానికి (7.4 శాతం) చేరింది. దీంతో ద్రవ్యోల్బణంపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో ఆగస్టులో కాస్త తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కల్పించే అంశం. ఆగస్టు నెలలో ఆహారపదార్థాల ద్రవ్యోల్బణం 11.51 శాతం నుంచి 9.94 శాతానికి తగ్గిందని ఎన్‌ఎస్‌ఓ వెల్లడించింది. పూర్తి సంవత్సరానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఈఐ అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని