SBI వాట్సాప్‌ సర్వీసులు.. సింగిల్‌ క్లిక్‌తో 15కు పైగా సేవలు

SBI Whatsapp banking services: తమ కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు మరింత దగ్గర చేసేందుకు ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఎస్‌బీఐ ప్రస్తుతం 15 రకాలకు పైగా సర్వీసులను అందిస్తోంది. ఆ సేవలేంటి? వాటి కోసం ఎలా రిజిస్ట్రర్‌ చేసుకోవాలి?

Updated : 27 Jul 2023 10:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) తమ ఖాతాదారులకు వాట్సాప్‌ సేవలను అందిస్తోంది. బ్యాంకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు వీటిని తీసుకొచ్చింది. బ్రాంచి వద్దకు వెళ్లాల్సిన పనిలేకుండా వాట్సాప్ ద్వారానే అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్‌, పెన్షన్‌ స్లిప్, లోన్ వంటి 15కు పైగా సేవలను పొందే వీలుంది. ఎస్‌బీఐ వాట్సాప్ ద్వారా ఏ సేవలు అందిస్తోంది? వాటిని ఎలా పొందాలి? ఆ వివరాలపై ఓ లుక్కేయండి..

రిజిస్ట్రేషన్ ఇలా..

ఎస్‌బీఐ వాట్సాప్‌ సేవలు పొందాలంటే తొలుత రిజిస్టర్‌ అవ్వాలి. ఇందుకోసం ఎస్‌బీఐ బ్యాంక్‌ ఖాతాకు లింక్ అయిన నంబర్‌ నుంచి SMS పంపాలి. WAREG అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి అకౌంట్‌ నంబర్‌ను (WAREG_XXXXX9843) వేసిన సందేశాన్ని 72089 33148 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపి రిజిస్టర్‌ చేసుకోవాలి. మీ రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిన వెంటనే ఎస్‌బీఐ అకౌంట్‌కు అనుసంధానించిన మొబైల్‌ నంబర్‌కు కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ అందుతుంది. ఆ తర్వాత వాట్సాప్‌ ద్వారా ఎస్‌బీఐ సేవలు పొందవచ్చు. ఇందుకోసం 90226 90226 నంబర్‌ను మీ కాంటాక్టుల్లో సేవ్‌ చేసుకోవాలి. తర్వాత చాట్‌ బాక్స్‌లోకి వెళ్లి Hi అని మెసేజ్‌ చేయాలి. ఆ తర్వాత చాట్‌బాట్‌ అందించిన ఆన్‌-స్క్రీన్‌ సూచనల ఆధారంగా మీకు అవసరమైన సమాచారాన్ని పొందొచ్చు. ఆయా సేవల వివరాలు ఇప్పుడు చూద్దాం..

శామ్‌సంగ్‌ గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 5 ఫోన్లు

బ్యాంక్‌ బ్యాలెన్స్‌: సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్‌.. ఇలా ఏ ఖాతా ఉన్న వారైనా వాట్సాప్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

మినీ స్టేట్‌మెంట్‌: చివరి 10 లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు.

అకౌంట్‌ స్టేట్‌మెంట్‌: చివరి 250 లావాదేవీలను అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ రూపంలో పొందొచ్చు.

ఇతర స్టేట్‌మెంట్‌ సేవలు: హోమ్‌ లోన్‌, ఎడ్యుకేషన్‌ లోన్‌, ఇంట్రస్ట్‌ సర్టిఫికెట్‌ వంటివి పొందొచ్చు.

పెన్షన్ స్లిప్: పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్‌ స్లిప్‌ల కోసం బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేదు. వాట్సాప్‌ ద్వారా తీసుకోవచ్చు.

రుణ వివరాలు: వాహన, గృహ, వ్యక్తిగత రుణాలతో పాటు గోల్డ్‌లోన్, ఎడ్యుకేషన్‌ లోన్‌ అందించే అన్ని రుణ సంబంధిత ప్రశ్నలు, రుణ రేట్లు వంటి వివరాలూ పొందొచ్చు. సందేహాలనూ నివృత్తి చేసుకోవచ్చు.

డిపాజిట్‌ వివరాలు: సేవింగ్‌ ఖాతా, రికరింగ్‌ డిపాజిట్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, టర్మ్‌ డిపాజిట్‌తో పాటు బ్యాంక్ అందించే అన్ని డిపాజిట్ల వివరాలు, వడ్డీ రేట్లు వాట్సాప్‌ ద్వారానే తెలుసుకోవచ్చు.

ఎన్‌ఆర్‌ఐ సేవలు: ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా వాట్సాప్ సాయంతో ఎస్‌బీఐ సేవలు పొందొచ్చు. NRE, NRO ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.

ఇన్‌స్టా సేవింగ్ అకౌంట్‌: 18 సంవత్సరాల వయసు నిండిన వారు వాట్సాప్ సాయంతో ఇన్‌స్టా సేవింగ్ ఖాతా తెరవచ్చు.

కాంటాక్టులు, హెల్ప్‌లైన్‌ నంబర్లు: ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవల్లో ఏదైనా సమస్య ఎదురైతే.. వాటి పరిష్కారానికి కావాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లను పొందొచ్చు.

ప్రీ అప్రూవ్డ్‌ లోన్లు: మీ ఖాతాపై అందుబాటులోఉన్న ప్రీ అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌, కార్‌ లోన్‌, టూ వీలర్‌ లోన్‌ వివరాలూ పొందొచ్చు.

బ్యాంక్‌ ఫారాలు: సాధారణంగా బ్యాంక్‌కు వెళ్లి తీసుకొనే డిపాజిట్‌, విత్‌డ్రా వంటి ఫారాలను సైతం వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పీడీఎఫ్‌ రూపంలో ఇవి డౌన్‌లోడ్‌ అవుతాయి.

డెబిట్‌ సేవలు: డెబిట్ కార్డ్‌ వినియోగ వివరాలు, లావాదేవీల హిస్టరీతో పాటు దానికి సంబంధించిన అన్ని వివరాలు వాట్సాప్‌ సేవల్లో పొందవచ్చు. కార్డ్‌ పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా వెంటనే లావాదేవీలను నిలిపివేయటం, కార్డును బ్లాక్ చేయటం వంటి సర్వీసులనూ వాట్సాప్ ద్వారా పొందొచ్చు.

ఏటీఎం సేవలు: మనకు దగ్గర్లో ఎక్కడెక్కడ ఎస్‌బీఐ ఏటీఎంలు ఉన్నాయో తెలుసుకోవచ్చు.

బ్యాంక్‌ హాలిడేస్‌: బ్యాంకు సెలవు దినాలు సైతం వాట్సాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. మీ రాష్ట్రం, తేదీ వివరాలు తెలియజేస్తే ఆ వివరాలు వాట్సాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

  • వీటితో పాటు ప్రమోషనల్‌ ఆఫర్లు, డిజిటల్‌ బ్యాంకింగ్‌ వివరాలనూ వాట్సాప్‌ ద్వారా పొందొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు