EPFO: పీఎఫ్ ఖాతాలో వివరాలు మార్చుకోవాలా? ఆన్‌లైన్‌లో సులువుగా..

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులా? మీ పీఎఫ్‌ ఖాతాలో వ్యక్తిగత వివరాలను మార్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఆన్‌లైన్‌ ఫారమ్‌తో సులువుగా మార్చుకోవచ్చు.

Updated : 07 Mar 2024 17:27 IST

EPFO | ఇంటర్నెట్‌డెస్క్‌: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులా? మీ పీఎఫ్ (PF) ఖాతాలో ఏవైనా తప్పులున్నాయా? లేదా వ్యక్తిగత వివరాలను అప్‌డేట్‌ చేయాలనుకుంటున్నారా?  ఆ వివరాలన్నీ సులభంగా మార్చుకొనే సదుపాయాన్ని ఈపీఎఫ్‌ఓ(EPFO) తీసుకొచ్చింది. ఉద్యోగి ప్రొఫైల్ మార్పుల కోసం జాయింట్ డిక్లరేషన్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీంతో ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ఫారమ్‌ ద్వారా కేవలం ఆన్‌లైన్‌లోనే వ్యక్తిగత వివరాలు అప్‌డేట్‌ చేసేయొచ్చు.

కొత్త విధానం.. కోత ఖాయం!

చందాదారుల వ్యక్తిగత వివరాలను సరిచేయడానికి ఈ జాయింట్‌ డిక్లరేషన్ ఫారమ్ ఉపయోగించాల్సి ఉంటుంది.  ఉద్యోగి పేరు, జెండర్‌, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రిలేషన్‌, వైవాహిక స్థితి, జాయినింగ్‌ డేట్‌, లీవింగ్‌ డేట్‌, రీజన్‌ ఫర్‌ లీవింగ్‌, నేషనాలిటీ, ఆధార్‌ నంబర్‌.. వంటి 11 రకాల వివరాలు మార్చుకోవచ్చు. ఈ వివరాలను అప్‌డేట్‌ చేయడానికి ఉద్యోగి, సంస్థ యజమాని ఇద్దరూ మార్పును ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంతకాలు చేసిన డిక్లరేషన్ ఫారాన్ని  పీఎఫ్ కమిషనర్‌కి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు మీ పీఎఫ్ ఖాతాలోని వివరాలను అప్‌డేట్‌ చేస్తారు.

ప్రక్రియ ఇదీ..

  • ముందుగా EPFO అధికారిక పోర్టల్‌ epfoindia.gov.inకు వెళ్లి పైన కనిపించే servicesపై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత స్క్రోల్‌ చేసి For Employees అనే ఆప్షన్‌ను ఎంచుకోగానే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.
  • అందులో కనిపించే services సెక్షన్‌ను వెళ్లి Member UAN/ online Serviceపై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో UAN, పాస్‌వర్డ్‌ వివరాలు ఎంటర్‌ చేసి లాగిన్ కావాలి.
  • స్క్రీన్‌పై కనిపించే Manage ఆప్షన్‌ను ఎంచుకోగానే అందులో joint declaration ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • అక్కడ మీ మెంబర్‌ ఐడీని ఎంటర్‌ చేసి మీరు అప్‌డేట్‌ చేయాలనుకుంటున్న వివరాలను తెలపాలి.
  • సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వివరాలు సబ్మిట్‌ చేశాక యజమానికి (ఎంప్లాయర్‌) లాగిన్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. ఎంప్లాయర్‌ రిజిస్టర్డ్‌ ఇ-మెయిల్‌కు కూడా వెళ్తాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని