బొగ్గు గనిలో ప్రమాదం.. 16 మంది మృతి

చైనాలోని ఓ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది కార్మికులు..

Published : 28 Sep 2020 01:27 IST

బీజింగ్‌: చైనాలోని ఓ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది కార్మికులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషయంగా ఉందని, పలువురు అస్వస్థతకు గురైనట్లు చైనా అధికారిక ప్రసార మాధ్యమం సీసీటీవీ వెల్లడించింది. నైరుతి చైనా చోంగ్‌కింగ్‌ ప్రాంతంలోని ఓ బొగ్గు గనిలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఆ ప్రమాదం అనంతరం వెలువడ్డ విషపూరిత వాయువు కార్బన్‌ మోనాక్సైడ్‌ కారణంగానే మరణాలు సంభవించాయని ప్రభుత్వం వెల్లడించినట్లు అధికారిక న్యూస్‌ ఏజెన్సీ జిన్‌హువా పేర్కొంది. ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తోన్న ఆ గనిలో ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని కిజియాంగ్‌ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సామాజిక మాధ్యమం వెయిబోలో వెల్లడించింది. 

కట్టుదిట్టమైన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల చైనాలోని బొగ్గు గనుల్లో ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. గత డిసెంబర్‌లో ఓ గనిలో జరిగిన పేలుళ్లలో 14 మంది మైనర్లు మరణించారు. 2018 అక్టోబర్‌లో జరిగిన ఓ ప్రమాదంలో 21మంది మైనర్లు, అదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన మరో ప్రమాదంలో ఏడుగురు మైనర్లు మృతిచెందారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని