AP News: గుంటూరులో 52ఆస్పత్రులకు జరిమానా

ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై అధికారులు కొరడా ఝళిపించారు. ఆరోగ్యశ్రీ కింద 50శాతం పడకలు ఇవ్వని ఆస్పత్రులపై గుంటూరు

Published : 27 May 2021 00:22 IST

గుంటూరు: ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై అధికారులు కొరడా ఝళిపించారు. ఆరోగ్యశ్రీ కింద 50శాతం పడకలు ఇవ్వని ఆస్పత్రులపై గుంటూరు జిల్లా అధికారులు భారీగా జరిమానా విధించారు. గుంటూరు జిల్లాలో 52 ఆస్పత్రులకు మొత్తంగా రూ.1.25కోట్ల జరిమానా విధించినట్టు కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ వెల్లడించారు. 25 ఆస్పత్రులకు రూ.2లక్షల చొప్పున;  12 ఆస్పత్రులకు రూ.5లక్షల చొప్పున; 15 ఆస్పత్రులకు రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్టు ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని