Crime news: షాకింగ్‌.. హోటల్‌ గదిలో సెక్స్‌ చేస్తూ వృద్ధుడి మృతి!

ఓ హోటల్‌ గదిలో భాగస్వామితో లైంగిక చర్యలో ఉండగా ఓ వృద్ధుడు (61) ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. అతడి మరణానికి తక్షణ......

Updated : 23 May 2022 20:52 IST

ముంబయి: ముంబయిలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్‌ గదిలో మహిళతో లైంగిక చర్యలో ఉండగా ఓ వృద్ధుడు (61) ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. అతడి మరణానికి తక్షణ కారణాలేమీ తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధుడు సబర్బన్‌ కుర్లాలోని ఓ హోటల్‌లో సోమవారం ఉదయం 10గంటల సమయంలో 40 ఏళ్ల మహిళతో కలిసి గది తీసుకున్నాడు. ఆమెను తన ప్రేయసిగా పేర్కొన్నాడు. ఆ తర్వాత కొంత సయమానికి హోటల్‌ రిసెప్షన్‌కు ఆ మహిళ ఫోన్‌ చేసి.. వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడని, ఎలాంటి స్పందన లేదని చెప్పింది. దీంతో హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని కుర్లా పోలీసులు వెల్లడించారు.

అనంతరం ఆ మహిళను కుర్లా పోలీస్‌ స్టేషన్‌కు తరలించి ప్రశ్నించగా.. వృద్ధుడు వర్లి ప్రాంతానికి చెందిన వాడని, ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్టు ఆమె చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, లైంగిక చర్యలో ఉండగా వృద్ధుడు మద్యం తాగేందుకు ప్రయత్నించాడని, కానీ అచేతన స్థితిలో పడిపోయాడని చెప్పినట్టు పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఏడీఆర్‌ (యాక్సిడెంటల్‌ డెత్ రిపోర్టు)గా కేసు నమోదు చేశామని, వృద్ధుడి మరణానికి కచ్చితమైన కారణాలు, లైంగిక చర్యలో పాల్గొనడానికి ముందు అతడు ఏమైనా ట్యాబ్లెట్లు తీసుకున్నాడా అనే విషయం తెలుసుకొనేందుకు వైద్య నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని