క్వారంటైన్‌ కేంద్రంలో ఎగసిపడ్డ మంటలు 

విశాఖ నగర శివారు చిన్నగదిలి మండలంలోని మారికివలస గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో

Published : 25 Aug 2020 02:37 IST

మధురవాడ: విశాఖ నగర శివారు చినగదిలి మండలంలోని మారికివలస గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఇటీవల మారికివలస శ్రీ చైతన్య జూనియర్ కళాశాల గ్రౌండ్ ఫ్లోర్‌, మొదటి అంతస్తులో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడవ అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కరోనా రోగులను పక్కనే వున్న మరో భవనంలోకి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మొత్తం ఈ క్వారంటైన్‌ కేంద్రంలో 64 మంది కరోనా రోగులుండగా వారెవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కళాశాలలో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జాయింట్ కలెక్టర్ గోవిందరాజు, నార్త్ జోన్ ఏసీపీ రవిశంకర్ రెడ్డి, కొవిడ్ నోడల్ అధికారి సుబ్బలక్ష్మి పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని