HYD: ఆ అమ్మాయి న్యూడ్‌ కాల్స్‌తో నన్ను వేధిస్తోంది: యువకుడి ఫిర్యాదు

ఇన్‌స్టాగ్రామ్‌లో వేధిస్తున్న యువతిపై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడో యువకుడు.

Published : 22 Sep 2022 18:55 IST

గచ్చిబౌలి: ఇన్‌స్టాగ్రామ్‌లో వేధిస్తున్న యువతిపై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడో యువకుడు. న్యూడ్‌కాల్స్‌ పేరుతో యువకులను ట్రాప్‌ చేస్తోందని తెలిపాడు. వీడియో కాల్‌ రికార్డు చేసి న్యూడ్‌గా మారుస్తోందని.. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతోందని వాపోయాడు. ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్‌ గోనె సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న యువకుడు(26)కి నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో స్వీట్‌గర్ల్‌ 948ఐడీ పేరిట ఉన్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది. స్నేహం పేరిట తొలుత వీరిద్దరి మధ్య సంభాషణ సాగింది. ఫోన్‌ నంబర్లు మార్చుకొని చాటింగ్‌ మొదలుపెట్టారు. 

ఆ తరువాత రెండు రోజులు వాట్సాప్ వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఆ మాయ లేడి నగ్నంగా వీడియో కాల్స్‌ చేసింది. తానేం తక్కువ కాదంటూ అతడూ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ఆమె ఉచ్చులో పడ్డారు. అతని నగ్న వీడియోలు, చిత్రాలను సేకరించిన ఆ కిలాడి యువతి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ బెదిరింపులకు దిగింది. రూ.5వేలు, 10వేలు పంపాలంటూ మెసేజ్‌లు పంపిస్తోంది. దీంతో విసిగిపోయిన బాధితుడు గురువారం గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని