Crime News : అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అమెరికాలో కాల్పుల సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ మేరీల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

Published : 10 Jun 2022 05:59 IST

వాషింగ్టన్‌: అమెరికాలో కాల్పుల సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ మేరీల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కొలంబియా మెషీన్‌ అనే కంపెనీలోకి చొరబడ్డ ఓ సాయుధుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. భద్రతాసిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడితో పాటు ఓ పోలీసు గాయపడ్డాడు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని