న్యాయవాదుల హత్య కేసులో మరొకరి అరెస్టు

హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు-నాగమణి హత్యకేసులో మరొకరు అరెస్టు అయ్యారు. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనుకు సహకరించిన మంథనికి చెందిన కాపు అనిల్‌ను పోలీసులు...

Updated : 10 Mar 2021 15:54 IST

హైదరాబాద్‌: హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు-నాగమణి హత్యకేసులో మరొకరు అరెస్టు అయ్యారు. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనుకు సహకరించిన మంథనికి చెందిన కాపు అనిల్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. మంగళవారం బిట్టు శ్రీనును పోలీసులు కోర్టు హాజరుపరిచారు. న్యాయస్థానం విచారణ జరిపి అతడికి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈ హత్య కేసులో బిట్టుశ్రీను నిందితులకు మరణాయుధాలు, వాహనం సమకూర్చాడని అభియోగాలున్నాయి. 
రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులుగా పనిచేస్తున్న మంథనికి చెందిన  వామన్‌రావు-నాగమణి దంపతులు ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లాలో దారుణహత్యకు గురయ్యారు. కారులో హైదరాబాద్‌ వస్తుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద కుంట శ్రీను ఇతరులతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు కేసు నమోదు చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని