ఆమె వ్యవహారశైలి నచ్చదు: ఏవీ సుబ్బారెడ్డి

ముగ్గురు సోదరుల కిడ్నాప్‌ వ్యవహారంలో ఏ1 నిందితుడు ఏవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఏ2 నిందితురాలిగా ఉన్న

Updated : 07 Jan 2021 06:17 IST

హైదరాబాద్‌: బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ముగ్గురు సోదరుల కిడ్నాప్‌ వ్యవహారంలో ఏ1 నిందితుడు ఏవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఏ2 నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసి వైద్యపరీక్షలకు తరలించగా.. తాజాగా  ఏవీ సుబ్బారెడ్డిని అరెస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా ఈటీవీతో ఆయన మాట్లాడారు. కిడ్నాప్‌ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాను ఏ-1 నిందితుడిని కాదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న పేర్లనే పోలీసులు పేర్కొన్నారని చెప్పారు. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. కిడ్నాప్‌ కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తానని చెప్పారు. అసలు తనకు అఖిలప్రియ వ్యవహార శైలి నచ్చదన్నారు. ప్రవీణ్‌రావు తమ కుటుంబ స్నేహితుడని.. నిజాలు బయటకు వచ్చాక మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానన్నారు. ఈ కేసులో తనకెలాంటి పాత్ర లేదని బాధితులే చెబుతారన్నారు.

ఇవీ చదవండి..

ఐటీ అధికారులమని వెళ్లి కిడ్నాప్‌ చేశారు: సీపీ

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని