సంవత్సరానికి కాదు.. జీవితానికే చివరి సెల్ఫీ

‘ఒరేయ్‌ బావా.. చూడు, ఇదే నా చివరి సెల్ఫీ.. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరు రోజు కదా.. అందుకే ఇదే చివరది’ అంటూ సరదాగా చిత్రీకరించుకున్న టిక్‌టాక్‌ వీడియోలోని మాటలు నిజమయ్యాయి. సంవత్సరానికే కాదు యువకుని జీవితానికే అది చివరి సెల్ఫీ అయింది.

Updated : 02 Jan 2020 17:47 IST

 టిక్‌టాక్‌లో చివరి మాటలే నిజమయ్యాయి..
 రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

విజయనగరం : ‘ఒరేయ్‌ బావా.. చూడు, ఇదే నా చివరి సెల్ఫీ.. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరు రోజు కదా.. అందుకే ఇదే చివరది’ అంటూ సరదాగా చిత్రీకరించుకున్న టిక్‌టాక్‌ వీడియోలోని మాటలు నిజమయ్యాయి. సంవత్సరానికే కాదు యువకుని జీవితానికే అది చివరి సెల్ఫీ అయింది. యాదృచ్ఛికమైన ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ఎం.కొత్తవలసకు చెందిన ఎం.వినోద్‌ గంట్యాడ మండలం పెదమజ్జిపాలెంకు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి వరకు ఆనందంగా గడిపాడు. ఈ సంవత్సరానికి ఇదే చివరి సెల్ఫీ అంటూ వీడియో చిత్రీకరించి పెట్టాడు. ఇది చిత్రీకరించిన కొద్ది గంటలకే ముగ్గురూ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. బొండపల్లి మండలం యడ్లపాలెం సమీపంలో అర్ధరాత్రి దాటాక తాటి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో వినోద్‌ పక్కనే ఉన్న చెరువులో పడి చనిపోయాడు. మిగిలిన ఇద్దరు గాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని