Crime News: కరోనా సాయం కోసం ఉద్యోగం పోయిందని నాటకం.. 16 నెలలు జైలుశిక్ష

కరోనా సమయంలో ఉద్యోగం పోయిందని నకిలీ ధ్రువపత్రం సమర్పించి ప్రభుత్వం 

Updated : 13 Dec 2021 05:50 IST

సింగపూర్‌: కరోనా సమయంలో ఉద్యోగం పోయిందని నకిలీ ధ్రువపత్రం సమర్పించి ప్రభుత్వం నుంచి నిధులు కాజేసేందుకు ప్రయత్నించిన భారత సంతతి మహిళకు సింగపూర్‌ న్యాయస్థానం 16 నెలల జైలుశిక్ష విధించింది. రాజగోపాల్‌ మాలిని (48) సింగపూర్‌లోని ఓ సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె గత ఏడాది  కొవిడ్‌-19 సహాయ నిధి పొందేందుకు సంస్థ.. తనను ఉద్యోగం నుంచి తొలగించినట్లు నకిలీ లేఖ సృష్టించారు. ప్రభుత్వానికి సమర్పించారు. విషయాన్ని గ్రహించిన సంస్థ.. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేశారంటూ జిల్లా జడ్జి మార్విన్‌ బే.. ఆమెకు 16 నెలల జైలు శిక్ష విధించారు. మాలిని.. తాను పనిచేస్తున్న సంస్థ నిధులనూ దుర్వినియోగపరిచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని