Crime News: ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి

గ్రేటర్‌ నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌ 7వ అంతస్తు నుంచి ఓ యువతి నగ్నంగా కిందపడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

Updated : 21 Dec 2021 10:51 IST

దిల్లీ: గ్రేటర్‌ నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌ 7వ అంతస్తు నుంచి ఓ యువతి నగ్నంగా కిందపడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువతి.. తన ప్రియుడి కోసం గతంలో ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోయింది. అనంతరం వారిద్దరు పానీపత్‌లో వివాహం చేసుకున్నారు. ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పలు కారణాల వల్ల వారు విడిపోయారు. ఆ తర్వాత ఆ యువతి పానీపత్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో పనిచేయడం మొదలుపెట్టింది. ఈ సమయంలోనే గ్రేటర్‌ నోయిడాలోని ఓ ఎన్‌ఆర్‌ఐ సొసైటీకి చెందిన కెమికల్‌ ఇంజినీర్‌ నితిన్‌ గుప్తాతో ఆమెకు  పరిచయమైంది. ఈ నెల 12న ఉదయం.. నితిన్‌ గుప్తా నివాసం కింద ఆ యువతి నగ్నంగా పడి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నితిన్‌ గుప్తాను విచారించారు. ‘‘కొవిడ్‌ కారణంగా.. నా భార్య గతేడాది మరణించింది. అప్పుడే ఆ యువతితో నాకు పరిచయం ఏర్పడింది. తరచూ కలుస్తూ ఉండేవాళ్లం. ఆ రోజు తను నా ఇంటికి వచ్చింది. ఇద్దరం భోజనం చేసి పడుకున్నాం. ఉదయం ఆరు గంటల సమయంలో తను లేచి స్నానాల గదికి వెళ్లింది. అనంతరం కింద పడిపోయింది. నా ఇల్లు 7వ అంతస్తులో ఉంది’’ అని నితిన్‌ పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని