Crime News: తండ్రీ కొడుకులు కొల్లగొట్టింది రూ.30 కోట్లు

బిట్‌కాయిన్లు, క్రిప్టో కరెన్సీలో మదుపు చేయండి.. మంచి లాభాలిస్తామంటూ గుజరాత్‌కు చెందిన తండ్రీకొడుకులు గోర్దాన్‌భాయ్‌ పటేల్‌, హితేష్‌ పటేల్‌ వందలమందిని మోసగించి కొల్లగొట్టింది రూ.30 కోట్లని తేల్చారు సైబర్‌ క్రైం

Updated : 22 Feb 2022 08:28 IST

స్వీక్స్‌ వ్యాలెట్‌ కంపెనీ ద్వారా లావాదేవీలు

ఈనాడు, హైదరాబాద్‌: బిట్‌కాయిన్లు, క్రిప్టో కరెన్సీలో మదుపు చేయండి.. మంచి లాభాలిస్తామంటూ గుజరాత్‌కు చెందిన తండ్రీకొడుకులు గోర్దాన్‌భాయ్‌ పటేల్‌, హితేష్‌ పటేల్‌ వందలమందిని మోసగించి కొల్లగొట్టింది రూ.30 కోట్లని తేల్చారు సైబర్‌ క్రైం పోలీసులు. పోలీసులు తనను గుర్తించినా పట్టుకోకుండా ఉండేందుకు స్వీక్స్‌ వ్యాలెట్‌ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించిన హితేష్‌, 14 నెలల వ్యవధిలో ఈ మొత్తం బదిలీ చేయించుకొని అమెరికా పారిపోయాడు. కేవలం తండ్రి మాత్రమే పోలీసులకు చిక్కి ప్రస్తుతం హైదరాబాద్‌లో జైల్లో ఉన్నాడు.

ఈ జాగ్రత్తలు అవసరం: సైబర్‌ పోలీసులు 

* షేర్ల క్రయవిక్రయాలకు డీమ్యాట్‌ ఖాతా ఉపయోగిస్తున్నట్టే క్రిప్టో కరెన్సీకి, బిట్‌కాయిన్ల కొనుగోలుకు ప్రత్యేకంగా ఒక బ్యాంక్‌ ఖాతా లేదా వ్యాలెట్‌ నిర్వహించాలి.

* బిట్‌కాయిన్లు కొంటే అనూహ్య లాభాలు రావు. సమయం పడుతుంది.

* క్రిప్టో కరెన్సీ ఊహాజనితం. కొనుగోళ్లు, అమ్మకాలున్నంత వరకూ డిజిటల్‌ నగదుకు ఎలాంటి ఢోకా ఉండదు. కొనుగోళ్లు ఆగిపోతే భారీగా నష్టాలొస్తాయి. మన వ్యాలెట్‌లో ఉన్నా ఉపయోగం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని