దొంగ నోట్ల ముఠా అరెస్టు

దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాలోని ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7.54 లక్షల విలువైన నకిలీ నోట్లు, ఒక కారు, సెల్‌ఫోన్లు, రూ.1లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌

Updated : 24 Jun 2022 06:10 IST

వివరాలు వెల్లడిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు,

అదనపు  డీసీపీ వైభవ్‌గైక్వాడ్, ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌ 

వరంగల్‌ క్రైం, న్యూస్‌టుడే: దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాలోని ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7.54 లక్షల విలువైన నకిలీ నోట్లు, ఒక కారు, సెల్‌ఫోన్లు, రూ.1లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ కథనం ప్రకారం.. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం ప్రగళ్లపల్లికి చెందిన సోర్లం ప్రసాద్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని విఠల్‌నగర్‌కు చెందిన జనగామ భాగ్యలక్ష్మి, భూపాలపల్లి జిల్లా టెకుమట్ల గ్రామం ఏంపెడ్‌కు చెందిన నల్లగోని రవీందర్‌ ముగ్గురిని అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన శ్రీఖర్, ఆంధ్రప్రదేశ్‌ కృష్ణ జిల్లాకు చెందిన శ్రీకాంత్‌లు పరారీలో ఉన్నారు. వీరంతా సులువుగా డబ్బులు సంపాదించాలని నకిలీ నోట్లను చలామణి చేయాలని నిర్ణయించుకొని వారం క్రితం శ్రీకాంత్, శేఖర్, ప్రసాద్‌తో కలిసి వరంగల్‌కు వచ్చారు. లక్ష రూపాయలు అసలు నోట్లు ఇచ్చి రూ.3 లక్షలు నకిలీ నోట్లను చలామణి చేసుకునేందకు భాగ్యలక్ష్మి, రవీందర్‌లు గురువారం పెద్దమ్మగడ్డకు వచ్చారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం రావడంతో హనుమకొండ పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టగా.. ప్రసాద్, భాగ్యలక్ష్మి, రవీందర్‌లు పోలీసులకు చిక్కారు. శేఖర్, శ్రీకాంత్‌ ఇద్దరు పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ కోసం హనుమకొండ పోలీసులకు అప్పగించామని గైక్వాడ్‌ పేర్కొన్నారు. గతంలో సోర్లం ప్రసాద్, జనగాం భాగ్యలక్ష్మి వీరిద్దరు నకిలీనోట్లు చలామణి చేస్తూ పోలీసులకు చిక్కారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని