logo

ప్రాణం తీసిన పసరు మందు

నాటువైద్యం ఓ బాలుడి ప్రాణం తీసింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ బాలుడికి తల్లిదండ్రులు అవగాహన లోపంతో రోజు పసరు మందు పట్టారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే అపస్మారక

Updated : 08 Aug 2022 04:59 IST

పసర మందు పట్టిన బాలుడికి పరీక్షిస్తున్న వైద్యురాలు హిమబిందు

నాటువైద్యం ఓ బాలుడి ప్రాణం తీసింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ బాలుడికి తల్లిదండ్రులు అవగాహన లోపంతో రోజు పసరు మందు పట్టారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.  

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ గొడుగుమామిడి గ్రామానికి చెందిన మూడో తరగతి విద్యార్థి వంతల వెంకట్‌ని కుటుంబ సభ్యులు తీవ్ర ఆనారోగ్యంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యాధికారి హిమబిందు పరీక్షలు నిర్వహించి, పసరు మందు పట్టినట్టు గుర్తించి తల్లిదండ్రులను ప్రశ్నించారు. వారం రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థానికంగా లభించే పసరు మందులు పట్టామని, వ్యాధి తగ్గకపోవడంతో ఆసుపత్రికి తీసుకువచ్చామని తండ్రి కేశవరావు   తెలిపారు. బాలుడు అప్పటికే అపస్మారక స్థితికి చేరాడు. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారి చొరవతో తల్లిదండ్రులు బాలుడిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి అంబులెన్సులో తీసుకువెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాలుడు మృతిచెందాడు. పసరు మందు పట్టడం పిల్లల ప్రాణాలకు ప్రమాదమని స్థానిక సామాజిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి హిమబిందు అన్నారు. ఆదివాసీలు నాటు వైద్యం, మూఢనమ్మకాలు విడిచిపెట్టాలని, వ్యాధి సోకిన వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలన్నారు. విద్యార్థి వెంకట్‌కు వారంపాటు పసర మందులు పట్టడం వల్ల ఆరోగ్యం క్షీణించి ప్రాణంమీదకు వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని