Hyderabad: తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం... భాగ్యలత సమీపంలోని అరుణోదయనగర్ కాలనీలో నివసించే తుమ్మలగుట్ట శ్రీకాంత్(33) ఐటీ ఉద్యోగి.
నాగోలు, న్యూస్‌టుడే: తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం... భాగ్యలత సమీపంలోని అరుణోదయనగర్ కాలనీలో నివసించే తుమ్మలగుట్ట శ్రీకాంత్(33) ఐటీ ఉద్యోగి. ఆర్నెల్ల క్రితం అతని తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని తలచుకొని తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్ నాటి నుంచి అన్యమనస్కంగా ఉంటున్నాడు.
జీవితంపై విరక్తితో.. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయాన గదిలో సీలింగ్ ఫ్యాను కొక్కేనికి ఉరివేసుకున్నాడు. ఉదయం అతని తమ్ముడు ప్రశాంత్ తలుపుకొట్టినా ఎంతకూ తెరవలేదు. కిటికీ అద్దాలు పగులగొట్టి చూడగా.. విగతజీవిగా ఉన్న అన్నను చూసి హతాశుడయ్యాడు. హయత్‌నగర్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. శ్రీకాంత్ రాసిన సూసైడ్ నోటులో తన చావుకు ఎవరూ కారణం కాదనీ.. అమ్మను చక్కగా చూసుకోవాలంటూ తమ్ముడికి సూచించాడు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్కు తప్పిన ప్రమాదం
-
India News
IRCTCలో టికెట్ల జారీ మరింత వేగవంతం.. నిమిషానికి 2.25 లక్షల టికెట్లు: వైష్ణవ్
-
Politics News
Revanth reddy: ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్లుగా ‘దళితబంధు’ అమలు: రేవంత్ రెడ్డి
-
Movies News
Nayanthara: నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. నయనతార షాకింగ్ కామెంట్స్
-
General News
TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా?: 6న హైకోర్టు తీర్పు
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు