Crime News: మద్యం మత్తులో భార్య, కుమార్తె హత్య
మద్యం మత్తు విచక్షణను చిత్తు చేసింది. మానవత్వాన్ని చంపేసింది. కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను కడతేర్చేలా చేసింది.
భూపాలపల్లి క్రైం, న్యూస్‌టుడే: మద్యం మత్తు విచక్షణను చిత్తు చేసింది. మానవత్వాన్ని చంపేసింది. కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను కడతేర్చేలా చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. భూపాలపల్లి ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మండలం వేశాలపల్లికి చెందిన ఎలగంటి రమణాచారికి భార్య, ఇద్దరు పిల్లలు. ఆయన మద్యానికి బానిసై భార్యతో గొడవపడేవాడు. బుధవారం రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రమణాచారి ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య రమ (43)ను నరికాడు. అడ్డుకోవడానికి వెళ్లిన కుమార్తె చందన (17)నూ నరికి చంపాడు. ఇది చూసి కుమారుడు (9) కేకలు వేయగా చుట్టు పక్కల వారు వచ్చి అతడిని కాపాడారు. చందన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. పోలీసులు రమణాచారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్కారుపై పుష్ అప్స్ తీస్తూ హల్చల్!
-
Politics News
Andhra News: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తాం: సీపీఐ రామకృష్ణ
-
Movies News
Srikanth Odhela: వైభవంగా ‘దసరా’ దర్శకుడి వివాహం.. నాని పోస్ట్‌తో శుభాకాంక్షల వెల్లువ
-
Politics News
PM Modi: పేదలను మోసగించడమే కాంగ్రెస్ వ్యూహం: ప్రధాని మోదీ
-
Politics News
TDP: ఇసుకను అమ్ముకుంటానని జగన్ మేనిఫెస్టోలో చెప్పారా?: సోమిరెడ్డి
-
General News
Amaravati: లింగమనేని రమేష్ నివాసం జప్తు పిటిషన్‌పై జూన్ 2న తీర్పు