దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!
అనుమానం పెనుభూతమై అన్నెంపున్నెం ఎరుగని శిశువును చావుబతుకుల మధ్యకు నెట్టేసింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఇరవై రోజుల క్రితం పుట్టిన బిడ్డకు పురుగుమందు ఎక్కించాడు.
అనుమానం పెనుభూతమై అన్నెంపున్నెం ఎరుగని శిశువును చావుబతుకుల మధ్యకు నెట్టేసింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఇరవై రోజుల క్రితం పుట్టిన బిడ్డకు పురుగుమందు ఎక్కించాడు. ప్రస్తుతం ఆ చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగింది.
ఎస్పీ సాగరిక నాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. చందన్‌కు తన్మయి అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. వీరికి మే 9న ఆడపిల్ల పుట్టింది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందువల్లే గర్భం దాల్చిందన్న అనుమానంతో చందన్ రగిలిపోయాడు. ప్రసవమైన రెండు వారాలకు స్థానిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తన్మయి పుట్టింటికి వెళ్లింది. భార్యాబిడ్డలను చూసే నెపంతో సోమవారం అక్కడకు చేరుకొన్న చందన్.. భార్య మరో గదిలో ఉన్న సమయంలో చిన్నారి శరీరంలోకి సిరంజి ద్వారా పురుగుల మందు ఎక్కించేందుకు ప్రయత్నించాడు. శిశువు ఏడుపు విని తన్మయి భర్తను నిలదీయగా బుకాయించాడు. వెంటనే పాపను బాలేశ్వర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సాగరిక నాథ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MiG 21: 2025 నాటికి మిగ్-21 యుద్ధ విమానాల సేవలు నిలిపేస్తాం: ఎయిర్ చీఫ్ మార్షల్
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం
-
Flipkart: ‘బిగ్ బిలియన్ డేస్’ యాడ్.. ఫ్లిప్‌కార్ట్, అమితాబ్‌పై కాయిట్ ఫిర్యాదు
-
Bandi Sanjay: ప్రధాని మోదీ వాస్తవాలు చెబితే ఉలుకెందుకు?: బండి సంజయ్
-
Hyderabad: ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రేయసి బలవన్మరణం