దైవదర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి

దైవదర్శనానికి బయలుదేరిన రెండు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం అంతులేని విషాదం నెలకొంది. వారు ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొనడంతో అయిదుగురు మృతి చెందారు.

Published : 07 Jun 2023 04:36 IST

ఆగి ఉన్న లారీని ఢీకొన్న తుఫాన్‌ వాహనం
అయిదుగురి మృతి, 14 మందికి గాయాలు

రాయచూరు, న్యూస్‌టుడే: దైవదర్శనానికి బయలుదేరిన రెండు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం అంతులేని విషాదం నెలకొంది. వారు ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొనడంతో అయిదుగురు మృతి చెందారు. ఏపీలోని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు, వెలుగోడు మండలాలకు చెందిన రెండు కుటుంబాలు కర్ణాటకలోని కలబురగి ఖాజా బందేనవాజ్‌ దర్గాకు తుఫాన్‌ వాహనంలో సోమవారం సాయంత్రం వెలుగోడు నుంచి బయలుదేరాయి. మంగళవారం వేకువజామున కర్ణాటకలోని యాదగిరి జిల్లా సైదాపూరు సమీపంలోని 150వ జాతీయ రహదారిపై వెళ్తుండగా తుఫాన్‌ డ్రైవర్‌ ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టాడు. ఆ ధాటికి ఘటనా స్థలంలోనే మునీర్‌(40), నయామత్‌(40), ముద్దత్‌ శిర్‌ (12), రమీజాబేగం(50), సుమ్ని(12)లు మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన 14 మందిని రాయచూరులోని రిమ్స్‌కు తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని బంధువులు కర్నూలు తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని