Vivo: 50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్‌.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌

Vivo V30e: మొబైల్‌ తయారీ కంపెనీ 3 ఏళ్లు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్, 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో కొత్త మొబైల్‌ను భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.

Updated : 02 May 2024 15:18 IST

Vivo V30e | ఇంటర్నెట్‌డెస్క్‌: వివో (Vivo) తన ‘V’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గతేడాది లాంచ్‌ చేసిన వివో వీ29ఈ కు మెరుగైన ఆదరణ వచ్చిన నేపథ్యంలో అదే సిరీస్‌లో ‘వివో వీ30ఈ’ (Vivo V30e) ను ఆవిష్కరించింది. 3 ఏళ్లు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ చెబుతోంది.

వివో వీ30ఈ మొబైల్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.27,999గా కంపెనీ పేర్కొంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా నిర్ణయించింది. వెల్‌వెట్‌ రెడ్‌, సిల్క్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ క్రెడిట్‌/డెబిట్ కార్డ్‌ల ద్వారా 10శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చని కంపెనీ చెబుతోంది. ఎక్ఛేంజ్‌ బోనస్‌ కూడా అందించనున్నట్లు పేర్కొంది. మే9 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని.. వివో ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది.

వాట్సప్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై ఈవెంట్‌ ప్లాన్‌ చేయొచ్చు!

ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. వివో కొత్త మొబైల్‌లో 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్‌ రేటు కలిగిఉంటుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6జెన్‌ 1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 (Android 14) ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్‌ 14తో వస్తోంది. వెనకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందువైపు 50 ఎంపీ కెమెరా అమర్చారు. 5,500mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ స్లాట్ సదుపాయం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని